30 ఏళ్ళు దాటిన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ.. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్ లేక కన్ ఫ్యూజన్ లో ఉన్న యువ హీరో నితీన్ కు సూపర్ హిట్ వచ్చింది. ఓ పక్క సోల్ మేట్ కు గ్రాండ్ వెల్ కం చెబుతూ.. తన లైఫ్ లో ఈ మూమెంట్ కెరియర్ లో సక్సెస్ తో ఎంజాయ్ చేయడం మాములు విషయం కాదు. అందుకే ఈ వారం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా లవర్ బోయ్ నితిన్ అదేనండి మన భీష్మ అని చెప్పొచ్చు. ఐదేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఎక్కడ తనతో కనీసం ఒక ఫోటో కూడా బయటకు రానివ్వలేదు అంటే నితిన్ ఎంత ముదురో అర్ధమవుతుంది.

 

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన షాలినిని తన జీవితంలోకి ఆహ్వానిచాడు నితిన్. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మగా వచ్చిన నితిన్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించింది. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. 

 

శ్రీనివాస కళ్యాణం తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత సినిమా చేసిన నితిన్ భీష్మతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు ఈ సినిమాతో వెంకీ కూడా డైరక్టర్ గా మరోసారి తన సత్తా చాటాడు. భీష్మగా నితిన్ తన టైమింగ్ తో డ్యాన్స్ తో ఇలా అన్ని యాంగిల్స్ లో అదరగొట్టాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సక్సెస్ అందుకున్న రష్మిక భీష్మతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కచ్చితంగా భీష్మ సినిమాకు రష్మిక గ్లామర్ చాలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: