వారం వారం సినిమా ల‌వ‌ర్స్‌కి శుక్ర‌వారం విడుద‌ల‌య్యే సినిమాల‌తో ఓ పెద్ద పండ‌గ లాగా ఉంటుంది. ప్ర‌తి శుక్ర‌వారం నాలుగైదు సినిమాలు విడుద‌లై పండ‌గ వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌స్తాయి. మ‌రి ఆ సినిమా హ‌డావిడి వీకెండ్ సండే వ‌ర‌కు మాములుగా ఉండ‌దు. అందులోనూ సిటీల్లో అయితే వీకెండ్ వ‌చ్చిందంటే చాలు ఎక్కువ‌గా యువ‌త ఎంజాయ్ చేయ‌డానికి ఎక్కువ ప్రాముఖ్య‌త ఇస్తుంటారు. అందులోనూ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి పెద్ద‌పీట వేసే సినిమాల‌కి ముందు ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. మ‌రి ఈ వారం కూడా ఎప్ప‌టిలాగానే సినిమాలు విడుద‌ల‌య్యాయి. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉప శీర్షిక. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కింది ఈ చిత్రం ఆశించినంత టాక్ అయితే తెచ్చుకోలేక‌పోయింది.

 

త‌ర్వాత హీరో నితిన్ న‌టించిన భీష్మ చిత్రం విడుద‌లైంది. నితిన్, రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ. ఈ చిత్రం సేంద్రీయ వ్యవసాయం అంశాన్ని స్పృశిస్తూ సాగే ప్రేమకథా చిత్రమని ప్రచార కార్యక్రమాల్లో చెప్పడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిపెరిగింది.  తొలి చిత్రం ‘ఛలో’ తో చక్కటి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల తన ద్వితీయ ప్రయత్నంగా ‘భీష్మ’ (సింగిల్‌ ఫరెవర్‌) చిత్రాన్ని రూపొందించారు. 

 

ఈ చిత్రం కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే చెప్పాలి. ఇందులో కామెడీ పీక్స్ లెవ‌ల్‌కి చేరుకున్నాయ‌ని చెప్పాలి. ఈ వారం చూడ‌ద‌ల‌చిన సినిమాల్లో బెస్ట్ ఆప్ష‌న్ అంటే భీష్మ‌కే ద‌క్కుతుంది. ఇంకా వ‌ల‌యం చిత్రం కూడా విడుద‌ల‌యింది. కానీ ఆశించినంత ఫ‌లితం రాలేదు. `వ‌సంత‌కాలం`లో అనే ఓ డ‌బ్బింగ్ చిత్రం విడుద‌ల‌య్యింది. అంతేకాక `చీమ ప్రేమ మ‌ధ్య‌లో భామ‌` అనే ఒక మూడు చిన్న సినిమాలు విడుద‌ల‌య్యాయి కాని మిగ‌తావేవి కూడా క‌నీసం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: