తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు.  ఈ మూవీ మంచి విజయం అందుకున్న తర్వాత గీతాగోవిందం, టాక్సీవాలా తో మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.  ఇలా వరుస విజయాలు విజయ్ దేవరకొండ సొంతం చేసుకుకోవడంతో ఈ హీరోపై దర్శక, నిర్మాతల  చూపు పడింది. దాంతో తెలుగు, తమిళంలో ఛాన్సులు వచ్చాయి.  అయితే విజయ్ దేవరకొండ నటించిన నోటా, డీయర్ కామ్రెడ్ లు రెండూ అపజయం పొందాయి.  ఈ బాధ నుంచి ఇంకా కోలుకోక ముందే ఇటీవల రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

 

  దాంతో ఆలోచలో పడ్డాడు విజయ్ దేవరకొండ.  ఇదిలా ఉంటే..  'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ పరాజయం వెనుక హీరో విజయ్ దేవరకొండ అతిగా కల్పించుకోవడమే కారణమని, సినిమా షూటింగ్ మొదలయ్యాక కథలో కల్పించుకోవడంతో పాటు ఎన్నో సన్నివేశాలను రీషూట్ చేయించాడని, ఫలితంగానే తాను అనుకున్న స్క్రిప్ట్ తప్పిందని దర్శకుడు క్రాంతి మాధవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. 

 

గత కొంత కాలంగా కొంత మంది హీరోలు ఫామ్ లోకి రాగానే.. డైరెక్షన్ విషయంలో కూడా తమ జోక్యం చేసుకుంటున్నారని.. దాంతో వాస్తవంగా తాము ఏం చూపించాలో అది పూర్తిగా మిస్ అవుతున్నామని.. చివరికి సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్స్ పైనే తోచేస్తున్నారి చాలా మంది ఆవేదన చెందుతున్నారు.  తాజాగా తన తొలి రెండు సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న క్రాంతి మాధవ్, మూడో చిత్రం 'ఉంగరాల రాంబాబు'తో నిరాశ చెందాడు.

 

ఇక ఇదే సమయంలో విజయ్ దేవరకొండ అతనితో కలవడంతో కెరీర్ గాడిలో పడుతుందని అందరూ భావించారు.  ఈ మూవీ విషయంలో  పకడ్బందీగా తాను తయారు చేసుకున్న స్క్రిప్ట్ ను విజయ్ చెడగొట్టాడని అందుకే సినిమా ఫ్లాప్ అయి, తనకు చెడ్డపేరు తెచ్చిందని క్రాంతి మాధవే అంటున్నాడని సినీ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: