సినిమా వారికి నటనతోపాటు వేరే వ్యాపారాలు ఉండటం సహజం. చాలా మంది నటులు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అక్కినేని ఇంటి కోడలు సమంత సినిమాల్లో ఎంత సక్సెస్ ఫుల్ హీరోయినో అందరికీ తెలిసిన విషయమే. సినిమాలతో పాటు చారిటీస్ కూడా ఎక్కువగా చేస్తుంది సమంత. ఇప్పుడు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. విద్యారంగంలో ఆమె అడుగుపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఫిబ్రవరి 22న ఓ స్కూల్ ను ప్రారంభించినట్టు  సమాచారం.

 

 

దీని గురించి ఇదివరకే తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను విద్యారంగంలోకి అడుగుపెడుతున్నట్టు.. ఫిబ్రవరి 22నే ఇందుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొంది. తాను నెలకొల్పబోయే ప్రీ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ ఏ విధంగా ఆ స్కూల్ ను ప్రారంభిస్తుందో ఆ వీడియోలో తెలిపింది. ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానా, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో క‌లిసి స‌మంత ఈ స్కూల్‌ను స్టార్ట్ చేస్తోంది. 2019 ప్రారంభంలో వీరికి వ‌చ్చిన ఈ ఆలోచ‌న ఇప్పటికి నిజ‌మైంద‌ని అంటోంది స‌మంత. ఈ స్కూల్‌కి ‘ఏకం’ అనే పేరు పెట్టుకుంది. ఈ స్కూల్ ద్వారా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేష‌న్ ఇస్తామని అంటోంది.

 

 

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. సమంత నటించిన `ది ఫ్యామిలీ మేన్` సీజ‌న్‌2లో సమంత న‌టించింది. ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద పిల్లల‌కు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాకు సమంత పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రంగంలోకి సమంత ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The doors to @ekamearlylearning open on the 22nd of february 2020.... "It is easier to build strong children than to repair broken men”-Frederick Douglass .. incredibly proud of our baby @ekamearlylearning @shilpareddy.official @muktakhuranaofficial .. giving our future wings to fly 👦👧

A post shared by samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరింత సమాచారం తెలుసుకోండి: