టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో వరుస హిట్లతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నెగటివ్ రోల్‌ లో నటించగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ ఫిల్మ్ హౌస్ ఫుల్ 4 కూడా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన 'హాథీ మేరే సాథీ' అనే మల్టీ లింగ్యువల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగులో ఆ సినిమా 'అరణ్య' పేరుతో రిలీజ్ అవుతోంది.

 

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన రానా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్‌ కూడా యూ ట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది. అడవి మనిషిలా కనిపిస్తున్న రానా అందర్నీ ఆకట్టుకున్నారు.

 

ఈ చిత్రంలో తమిళ యువ నటుడు విష్ణు విశాల్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇటీవల జ్వాలాతో డేటింగ్ అంటూ టాలీవుడ్ మీడియాలోనూ సందడి చేసిన విష్ణు తాజాగా అరణ్య సినిమాతో మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాడు.

 

తాజాగా చిత్ర బృందం విష్ణు విశాల్ మరో లుక్ ను విడుదల చేసింది. అందులో ఆయన ఒక ఏనుగుపై పడుకొని కనిపిస్తున్నాడు. సినిమా విష్ణు పాత్ర ప్రేక్షకులకు బాగా అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఏప్రిల్ 2న 'అరణ్య' రిలీజ్ అవుతోంది. హిందీలో 'హాథీ మేరే సాథీ', తమిళంలో 'కాండన్' పేరుతో వస్తోంది. ఎంతో లావిష్ గా తయారవుతున్న ఈ సినిమాని ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. పర్యావరణం, అడవుల నరికివేత వంటి సమస్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రధారుల్లో నటిస్తున్నారు.
Image

మరింత సమాచారం తెలుసుకోండి: