మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటి వరకు తమ సత్తా చాటుతూ వెళ్తున్నారు.  రాక్షసుడు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత నిర్మాతగా మారిపోయాడు.   ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగాడు.  అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాతో భారీగా నష్టపోయాడు.  దాంతో ఆర్థికంగా చాలా కష్టాల్లో పడ్డాడు.  ఆ సమయంలో నాగబాబు కి పవన్ కళ్యాన్ ఎంతో సహాయం చేసినట్లు పలు సందర్భాల్లో చెప్పాడు.  అయితే నాగబాబు కి అదృష్టం కలిసి వచ్చి జబర్ధస్త్ లో జబర్ధస్త్ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తూ ఏడేళ్లు మంచి ఫామ్ లో కొనసాగారు. 

 

ఈ సమయంలో ఆయన ఆర్థికంగా బాగా రికవరీ అయ్యారు.  అయితే నాగబాబు ఆర్థికంగా కోలుకున్నప్పటికీ నిర్మాణ రంగం వైపు వెళ్లలేదు.  తాజాగా ఆయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జీ తెలుగు లో వస్తున్న అదిరింది కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  అంతే కాదు ఆయన సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు.  దాని ద్వారా తన మనసులో మాటలు నిర్భయంగా వెలుబుచ్చుతున్నారు.  ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఆయన పాల్గొని ఓడిపోయారు. 

 

జనసేన పార్టీపై ఎవరు కామెంట్స్ చేస్తున్నా వారికి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇక పిల్లల విడాకులకు పెద్దలు ఎలా కారణమవుతున్నారో తెలుపుతూ మహా సహస్రావధాని  గరికపాటి నరసింహారావు చేసిన ప్రసంగం నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ వీడియో నాగబాబు పోస్ట్ చేశారు.  జీవిత సత్యాలని ఖరా ఖండిగా, గొప్పగా, అద్భుతమైన హాస్యంతో చెప్పిన శ్రీ గరికపాటి నరసింహరావు గారు. 28 నిమిషాల నాన్‌స్టాప్‌ హాస్యాన్ని అద్భుతమైన నిజాలతో చెప్పారు. 28 నిమిషాల హాస్యం గ్యారంటీ.. నవ్వకపోతే నేను గ్యారంటీ...' అంటూ నాగబాబు ఈ వీడియోను పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: