త‌మిళ అగ్ర న‌టుడు విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి రెడీ అయ్యారా..?  ద్ర‌విడ పార్టీల‌తోపాటు బీజేపీని ఆయ‌న ముప్పుతిప్ప‌లు పెట్ట‌బోతున్నారా ... ?  రాజీకీయాల్లోకి రావ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తున్న విజయ్ సొంతంగా పార్టీ పెట్ట‌బోతున్నాడా.. లేక మ‌రేదైన పార్టీలో చేర‌బోతున్నాడా.. తమిళనాడులో ఇప్పుడిదే హాట్ టాపిక్ న‌డుస్తోంది.  వ‌రుస విజయాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న విజ‌య్‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అమీతుమీ తేల్చుకోడానికి  సిద్ధ‌మ‌య్యార‌ని కోలివుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.



ఇటీవ‌ల విజ‌య్ న‌టించిన మెర్సీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూల్లు రాబ‌ట్టిన  సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు, స‌న్నివేశాలు హిందూ మ‌తాన్ని కించ‌ప‌ర్చేలా ఉన్నాయని ప‌లు హిందూ సంఘాల‌తో పాటు రాష్ఱంలో బీజేపీ  ఆందోళ‌న‌లు చేప‌ట్టింది.  అయితే మ‌ద్రాస్ హైకోర్టు నుంచి క్లీన్‌చిట్ రావ‌డం,  అదే స‌మ‌యంలో త‌మిళ న‌టులంతా విజ‌య్‌కు బాస‌ట‌గా నిలవ‌డంతో వివాదం సద్దు మ‌ణిగింది. అయితే ఇటీవల హీరో విజ‌య్‌పై ఐటీ శాఖ పెద్ద ఎత్తున దాడుల‌కు దిగడం క‌ల‌క‌లం రేపింది.

బీజేపీ ప్ర‌భుత్వం క్రిస్టియ‌న్ అయిన హీరో విజ‌య్‌పై కావాల‌నే ఐటీ దాడులు చేపించింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈక్ర‌మంలోనే హీరో విజ‌య్‌కూడా  బీజేపీతో ఢీ అంటే ఢీ అంటూ త‌ల‌ప‌డ్డారు.  తాను కూడా హీరో ర‌జ‌నీకాంత్‌లా సీఏఏకు అనుకూలంగా మాట్లాడి ఐటీ దాడుల నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని, కానీ అలా చేయన‌ని, తాను ద్రవిడున‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని, బీజేపీకి  భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ఒక్క‌సారిగా విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ర‌క‌ర‌కాలు ఊహాగానాలు వి నిపించాయి. ఈక్ర‌మంలోనే త‌మిళ‌నాడులోని ప్ర‌ధాన పార్టీలు విజ‌య్ ను రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డానికి త‌మవంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. మ‌రో ఏడాదిలో త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకే జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత బ‌ల‌హీన ప‌డింది. ఇదే స‌మ‌యంలో కాస్త బ‌లం పుంజుకున్న డీఎంకేకు కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షంగా ఉంది.



మ‌రో ప‌క్క క‌మ‌ల్‌హ‌స‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీని స్థాపించి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.
ఇంకా  సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేదుకు రెడీ అవుతున్నారు. ఈ స‌మ‌యంలో హీరో విజ‌య్‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటే ఎంతో లాభిస్తుంద‌ని, అ ధికారం దక్కించుకోవ‌చ్చ‌ని కాంగ్రెస్ తోపాటు మిత్ర‌ప‌క్షం డీఎంకే భావిస్తున్న‌ట్లు స‌మాచారం.  విజ‌య్‌ను తాము ఆహ్వానించ‌లేదంటున్న కాంగ్రెస్ నేత అల‌గిరి ఆయ‌న వ‌స్తానంటే మాత్రం సాద‌రంగా ఆహ్వానించ‌డ‌మే కాదు.. స‌ముచిత స్థానం కూడా క‌ల్పిస్తామ‌ని చెప్ప‌డం ఆ పార్టీ ఉద్దేశ్యాన్ని చెప్ప‌క‌నే చెబుతోంది.



ఒక‌వేళ విజ‌య్ కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీ త‌ర‌పున భ‌విష్య‌త్తులో సీఎం అభ్య‌ర్థి కూడా అవుతారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇంత జ‌రుగుతున్నా హీరో విజ‌య్ మాత్రం పెద‌వి విప్ప‌కుండా వ్యూహాత్మాక మౌనం కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తారా.. వ‌స్తే ఒక‌వేళ ఏ పార్టీలో చేరుతారు అనేది తేలాలంటే మాత్రం మరికొంత స‌మ‌యం వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: