ఒక‌ప్పుడు తెలుగు బుల్లితెర‌పై జెమినీ ఛానెల్‌దే గుత్తాధిప‌త్యం. ఆ ఛానెలే బుల్లితెర రారాజు. అయితే కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా.. తెలుగు బుల్లితెర రంగంలోకి మా టీవీ తో పాటు ఎన్నో ఛానల్స్ పుట్టుకు వచ్చాయి. ఇక మా ఛానెల్‌ను స్టార్‌ గ్రూప్ టేకోవర్ చేయడంతో ఆ ఛానల్ ద‌శ మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా జెమినీ టీవీ కి అండగా ఉంటూ వస్తున్న తెలుగు మహిళా లోకం ఇప్పుడు ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వస్తున్న ప్రసారాలకు వెళ్ళిపోతున్నారు



దీంతో బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకునేందుకు సన్‌నెట్‌ వర్క్ చేయని ప్రయోగం అంటూ లేదు. ఓవైపు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అనేక ర‌కాల ప్రోగ్రామ్‌ల‌తో టీఆర్పీ రేటింగ్‌ల‌తో దూసుకు పోతున్నాయి. వాటి రేటింగ్ అందుకునేందుకు స‌న్ నెట్ వ‌ర్క్ నానా అష్ట‌క‌ష్టాలు పడుతోంది. ఇక మిగిలిన ఛానెల్స్ దూసుకు పోతుంటే జెమినీ మాత్రం ప్రేక్షకుడిని పల్స్ పట్టుకోలేక ప్రతివారం రేటింగ్స్‌లోనూ చతికిలపడుతూనే ఉంది.


అంతెందుకు జెమినీ ఛానెల్‌కు పోటీగా ఉన్న ఈటీవీ సైతం అనేక ఆక‌ర్ష‌ణీయ ప్రోగ్రామ్‌ల‌తో రేటింగ్‌ల ప‌రంగా దుమ్ము దులుపుతోంది. పైటీ జెమినీ ఛానెల్ ఓ ప్రోగ్రామ్‌కు పెట్టే అమౌంట్ తో పోలిస్తే ఈటీవీ ప్రోగ్రామ్స్‌కు అంత ఖ‌ర్చు కూడా ఉండ‌దు. ఇక మ‌రో వైపు మా ఛానెల్‌ను స్టార్ వాళ్లు టేకోవ‌ర్ చేశాక మాటీవీ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో, సీరీయల్స్‌తో పోటీలో దూకుడు మీదుంటుంది.



ఇక మ‌ధ్య‌లో రేసులో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయిన జీ తెలుగు కూడా స‌రికొత్త ప్రోగ్రామ్స్‌, స‌రికొత్త సీరియ‌ల్స్‌తో ఒక్క‌సారిటా టాప్ రేసులో ఉంది. ఇక ఏదో ఒక‌టి చేయ‌క‌పోతే మ‌రింత వెన‌క‌ప‌డిపోతామ‌నో ఏమోగారి ఇప్పుడు స‌న్ నెట్ వ‌ర్క్ మ‌రో స‌రి కొత్త ప్లాన్లు వేస్తోంది. వ‌రుస పెట్టి కొత్త సినిమాల రైట్స్ తీసుకుంటోంది. ఇప్ప‌టికే అల వైకుంఠపురములో సినిమాను తీసుకోగా, రిలీజ్‌కు ఇంకా చాలా సమయమున్న సూర్య నటిస్తోన్న ఆకాశమే నీ హద్దురా సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వ‌రుస‌గా అటు త‌మిళ్‌, ఇటు తెలుగులో స్టార్ హీరోల సినిమాల రైట్స్ తీసుకుని మ‌ళ్లీ టాప్ రేంజ్‌కు వెళ్లాల‌నుకుంటోంద‌ట‌. మ‌రి ఈ స‌రికొత్త ప్లాన్ అయినా వ‌ర్క‌వుట్ అవుతుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: