ఈ మద్య తెలుగు హీరోలు పెళ్లిళ్ల బాట పట్టారు.  వరుసగా బ్యాచ్ లర్ హీరోలు పెళ్లిళ్లకు సిద్దమవుతున్నారు.  జయం సినిమాతో హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన నితిన్ ఇప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి పందొమ్మిదేళ్లు అయ్యింది.  అయితే హీరోగా కెరీర్ లో పెద్ద హిట్స్ సాధించకున్నా.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  తాజాగా భీష్మ సినిమాతో మంచి హిట్ అయ్యాడు.  ఇక హ్యాపీడేస్ సినిమా తర్వాత  కార్తికేయ నుంచి మొన్నటి అర్జున్ సురువరం వరకు విజయాలు సాధిస్తూ కెరీర్ పరంగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు నిఖిల్. 

 

తాజాగా ఈ హీరోలు తమ బ్రహ్మచారి జీవితానికి ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో ఫుల్ స్టాప్ పెడుతూ ఉండడం గమనార్హం.ఈమధ్యే యువ హీరో నితిన్ తన మ్యారేజ్ సంగతి వెల్లడించాడు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇంతలో నితిన్ కొత్త సినిమా 'భీష్మ' విడుదలైంది.  హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిఖిల్ లాస్ట్ సినిమా 'అర్జున్ సురవరం' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది.  అయితే అ సినిమా పెళ్ళి విషయం వెల్లడించక ముందు కాబట్టి కౌంట్ చెయ్యలేం. అయితే మ్యారేజ్ జరిగేలోపు 'కార్తికేయ 2' రిలీజ్ కాకపోతే మాత్రం బ్యాచిలర్ లైఫ్ లో లాస్ట్ సినిమా అర్జున్ సురవరం' అయ్యే అవకాశం ఎక్కుగా ఉంది. 

 

నితిన్ కొంత కాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.  దర్శకులు వెంకి కుడుముల పుణ్యమా అని ఈ ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  మొత్తానికి ఎంగేజ్ మెంట్ తర్వాత శుభవార్త వినడం.. పెళ్లి తర్వాత మరిన్ని విజయాలు అందుకుంటాడా అన్న సంకేతాలు వనిపిస్తున్నాయ.  వీరి సంగతి ఇలా ఉంచితే.. టాాలీవుడ్ హీరోలు ప్రభాస్, రానా లాంటి దిగ్గజాలు ఎప్పుడు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: