టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అటు బాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు ఉంది. స్వతహాగా చూడడానికి హాలీవుడ్ హీరో రేంజ్ పర్సనాలిటీ, ఫిజిక్, అందం కలిగిన మహేష్ తో ఒక్క సినిమా అవకాశం వస్తే చాలని మన టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల హీరోయిన్లు సైతం పలు సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 

 

ఇక కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న మన సూపర్ స్టార్, వేరొక భాషలో ఒక్క సినిమా కూడా చేయకుండా ఇంత పేరు సంపాదించడం అంత సులువు కాదని, అందుకే థమ్స్ అప్ సహా పలు దిగ్గజ బ్రాండ్లు సైతం సూపర్ స్టార్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటుంటాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లలో సూపర్ స్టార్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి వారిలో మహేష్ అంటే ఎంతో ఇష్టపడే సంగీత దర్శకుడు కమ్ సింగర్ అయిన రఘు కుంచె కూడా ఒకరు. 

 

ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా రఘు కుంచె మాట్లాడుతూ, మన తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన తనయుడు మహేష్ ని మనకు హీరోగా అందించడం నిజంగా మన టాలీవుడ్ కి ఎంతో గర్వకారణం అని, ఒక్కసారి ఆయనను చూస్తే హాలీవుడ్ రేంజ్ జేమ్స్ బాండ్ హీరోలు గుర్తుకువస్తారని, మనకి కూడా ఒక జేమ్స్ బాండ్ ఉన్నారని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చని రఘు మాట్లాడుతూ చెప్పారు. ఇక ఇదే విధంగా గతంలో యాక్టర్ శివాజీ మాట్లాడుతూ, ఓవర్సీస్ లో మహేష్ కు ఉన్న ప్రభంజనం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం అయ్యాయి. ఎంతైనా సూపర్ స్టార్ రేంజ్ అది మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: