సాధారణంగా మన దేశం లో సినిమా అనేది చాలా మందికి ప్రాణం. గతంలో ఏమో గాని ఇప్పుడు అన్ని భాషలలోను సినిమా అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంగతి పక్కన పెడితే ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. చాలా మంది అభిమానులు తమ అభిమాన హీరోల పేరుతో హడావుడి చేస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత ఇది కాస్త ఎక్కువైంది అనేది వాస్తవం. 

 

అయితే ఇక్కడ కొంత మంది అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఇబ్బందిని ఎదుర్కొంది. సినిమా పోస్టర్ ని సోషల్ మీడియాలో ఎక్కువగా విడుదల చేస్తున్నారు. హీరో మీద తమకు ఉన్న అభిమానంతో అచ్చూ అదే ప్రమాణాలతో పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. దీనితో ఏది నిజం పోస్టర్, ఏది ఫేక్ పోస్టర్ అనేది అర్ధం కాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కూడా ఇదే విధంగా పోస్టర్స్ బయటకు వచ్చాయి. 

 

ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇదే టైటిల్ అంటూ కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ తో రెండు పోస్టర్స్ ని ఫాన్స్ విడుదల చేసారు. ఇవి నిజమే అనుకున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేసేసారు. నిజంగా అదే టైటిల్ అనుకున్నారు. కాని దానికి సంబంధించి ఎక్కడా కూడా అధికారిక ప్రకటన అనేది లేదు. అదే ప్రమాణాలతో విడుదల చేసారు పోస్టర్స్. స్టార్ హీరోల సినిమాలకు ఈ హడావుడి ఈ మధ్య ఎక్కువైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: