సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకలేదనే కంప్లయింట్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఏజ్ గ్యాప్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు ఎవరూ లేరని చాలామంది చెబుతున్నారు. అయితే ఇప్పుడు సీనియర్లకే కాదు యంగ్ స్టర్స్ కు కూడా హీరోయిన్లు దొరకట్లేదు. 

 

ఇప్పటి వరకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకే హీరోయిన్లు దొరకట్లేదనే మాటలు వినిపించాయి. సీనియర్ హీరోలకు కథలు బాగానే దొరుకుతున్నాయి కానీ.. ఆ కథలకు సెట్ అయ్యే కథానాయికలే కష్టమైపోతున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు యంగ్ స్టర్స్ కు కూడా సరైన మ్యాచ్ దొరకట్లేదు. 

 

కాజల్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు సీనియర్లతో జోడీ కట్టేందుకు అంతగా ఇష్టపడట్లేదు. కాజల్, తమన్నా లాంటి వాళ్లు చిరుతో కలిసి నటించినా ఆడియన్స్ ను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారు. అలాగని ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు వీళ్లని తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇక కుర్రాళ్లు అయితే స్టార్డమ్ డిఫరెన్సెస్ తో వీళ్లకు దూరంగా ఉంటున్నారు. మీడియం రేంజ్ సినిమాలకు అందుబాటులో ఉన్న లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు ఈ కేటగిరీ నుంచి దూరమవుతున్నారు. సరైన సక్సెస్ లేకపోవడం, కుర్రాళ్లలో ఫాలోయింగ్ తగ్గడంతో మీడియం రేంజ్ హీరోలు వీళ్లను ఛాయిస్ గా చూడటం లేదు. 

 

యంగ్ హీరోలతో సినిమాలు చేస్తే హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉంటారు. కుర్రాళ్ల ఫాలోయింగ్ తో కాల్షీట్ల రేట్ కూడా పెరుగుతుంది. అందుకే యంగ్ స్టర్స్ తో సినిమాలు అంటే హీరోయిన్లు వెంటనే డేట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోతున్నాయి. స్టార్డమ్ లెక్కలతో మీడియం రేంజ్ హీరోలకు సరైన హీరోయిన్లు దొరకట్లేదు. నాని, నాగచైతన్య లాంటి హీరోలు 20 నుంచి 30కోట్ల మార్కెట్ రేంజ్ లో ఉన్నారు. సో ఈ మీడియం రేంజ్ హీరోలకు ఇదే స్థాయిలో హీరోయిన్లు కావాలి. దీంతో వీళ్లకు నివేదా థామస్, సాయిపల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప పెద్దగా ఛాయిస్ లు కనిపించడం లేదు. 

 

బడ్డింగ్ స్టేజ్ లో ఉన్న హీరోలకు అయితే కొత్త హీరోయిన్లు తప్ప, ఆడియన్స్ లో కాస్త గుర్తింపు ఉన్నోళ్లు అసలు కనిపించడం లేదు. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు చాలా రోజులు హీరోయిన్ సెట్ అవ్వలేదు. బోల్డన్ని సెర్చింగుల తర్వాత పూజా హెగ్డేని తీసుకున్నారు. మీడియం రేంజ్ హీరోలకు పెద్దగా ఆప్షన్స్ లేవంటే.. చాలామంది హీరోలు ఫ్రెష్ కాంబినేషన్స్ కు ఓటేస్తున్నారు. ఒకటిరెండు సార్లు కలిసి నటించిన హీరోయిన్లను తీసుకోవడానికి హీరోలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో చిన్న హీరోలకు కూడా హీరోయిన్లను వెతకడం దర్శక నిర్మాతలకు చాలా కష్టంగా మారుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: