టాలీవుడ్ నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రెండేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఆ సినిమా ద్వారా తన క్రేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచుకున్నారు అనే చెప్పాలి. ఆ సినిమాలో చెవిటి వ్యక్తి చిట్టిబాబుగా రామ్ చరణ్ నటనకు అటు విమర్శకులు, ఇటు అభిమానులతో పాటు ఎందరో ప్రేక్షకులు సైతం మంత్రముగ్దలు అయ్యారు. 
అయితే ఆ తరువాత గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. ఇక కొద్దిరోజలుగా మరొక నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న చేస్తున్న చరణ్, తదుపరి ప్రాజక్ట్స్ పై మరింతగా దృష్టిపెట్టినట్లు టాక్.

 

ఇకపోతే ఎప్పటికప్పుడు తాజా సినిమాలు అలానే తన వ్యక్తిగత విషయాలపై ప్రేక్షకులు అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకునే అలవాటున్న చరణ్, నేడు తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క బ్రాట్ తో కలిసి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

 

వైట్ కలర్ టీ షర్ట్ పాటు అదే కలర్ పంచె కట్టుకుని సరదాగా తన పెట్ తో గడుపుతున్న చరణ్ పోస్ట్ చేసిన ఆ ఫోటో పై పలువురు మెగాఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్ తో కొంత విశ్రాంతి లేకుండా గడిపిన మెగాపవర్ స్టార్, నేడు సరదాగా తన పెట్ తో ఎంజాయ్ చేయడం చూస్తుంటే, తదుపరి చేయబోయే షెడ్యూల్స్ కోసం ఆయన రెఫ్రెషింగ్ మోడ్ లోకి వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చరణ్ పోటీ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: