స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే కెరీర్ మారిపోతుంది అంటారు. రేసులో ఎక్కడికో వెళ్తారని చెబుతారు. కానీ ఈ ఆశలతోనే భారీ సినిమాలు తీసిన ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు భారీ షాకులు తగిలాయి. పెద్ద సినిమాల తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. 

 

భారీ హిట్ బాహుబలి తర్వాత ప్రభాస్ ఏం చేయబోతున్నాడు అనే టైమ్ లో సాహోతో ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. బాహుబలి ది బిగినింగ్ టైమ్ లో ఓకే అయి బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత సాహో రిలీజ్ అయింది. అయితే భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ సాధించలేక సుజిత్ ని సమస్యల్లో పడేసింది. 

 

సుజిత్ దర్శకత్వంలో 300కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన సాహో ఈ రేంజ్ కు తగ్గ రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ ని నిరాశపరిచింది. దీనికితోడు సుజిత్ డైరెక్షన్ పై చాలా విమర్శలొచ్చాయి. యాక్షన్ సీన్స్ పై పెట్టిన ఫోకస్ కథపై పెట్టుంటే బెటర్ రిజల్ట్ వచ్చుండేది అని రివ్యూలు వచ్చాయి. 

 

సాహో రిజల్ట్ సుజిత్ కెరీర్ ని గట్టిగా దెబ్బకొట్టింది. ప్రభాస్ స్టార్డమ్ హ్యాండిల్ చేయలేక పోయాడనే విమర్శలతో సుజిత్ పై నెగిటివ్ ఇంప్రెస్ క్రియేట్ అయింది. దీంతో ఈ దర్శకుడికి సినిమా కష్టాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. మీడియం రేంజ్ హీరోలు కూడా సుజిత్ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారనే టాక్ వస్తోంది. 

 

చి.ల.సౌతో సూపర్ అనిపించుకున్న రాహుల్ రవీంద్రన్ సెకండ్ సినిమాతో నాగార్జునని డైరెక్ట్ చేశాడు. మన్మథుడు 2తో అన్నపూర్ణ కాంపౌండ్ లోకి వెళ్లాడు. కానీ ఏ సర్టిఫికెట్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా డైలాగుల విషయంలో చాలా చెడ్డపేరొచ్చింది. 

 

మన్మథుడు 2లో రాహుల్ అచ్చమైన తెలుగు డైలాగులు రాశాడు. అయితే కొన్ని తెలుగు డైలాగులు డబుల్ మీనింగ్ లోకి వెళ్లాయి. ఇక సీినియర్ హీరో నాగార్జున ఆ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం అక్కినేని అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇక సినీజనాలు అయితే నాగార్జున ఇమేజ్ ని రాహుల్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేదనే కామెంట్స్ వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: