హీరోకు క్రాక్ ఉంటే ఆ కథ వేరేలా ఉంటుంది. ముఖ్యంగా మాస్ రాజా రవితేజ తిక్కకు లెక్క ఉండదు. బూతులు తిడతాడు. కొడతాడు. క్రాక్ ఎక్కువైతే.. బొటన వేరు కట్ చేసి పారేస్తాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ లోనే ఇంత క్రాక్ చూపిస్తే.. ఇక సినిమాలో ఎంత తిక్క చూపిస్తాడో మరి. 

 

క్రాక్ టీజర్ చూస్తుంటే.. మాస్ రాజా మళ్లీ కమర్షియల్ ఫార్ములాలోకి వచ్చేశాడనిపిస్తోంది. డాన్ శీను.. బలుపు తర్వాత రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న మూడో సినిమా క్రాక్. ఈ సినిమాతో హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు దర్శకుడు. బలుపు తర్వాత శృతి మరోసారి రవితేజతో జత కడుతోంది. 

 

రవితేజ హిట్ చూసి మూడేళ్లు దాటింది. రాజా ది గ్రేట్ తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మూవీ డిస్కోరాజాతో కొత్తగా ప్రయత్నించినా.. నిరాశే ఎదురైంది. దీంతో ఈ సారి బలుపుతో కలిసొచ్చిన గోపీచంద్ మలినేనినే నమ్ముకున్నాడు రవితేజ. 

 

రీసెంట్ గా రిలీజ్ చేసిన క్రాక్ టీజర్ కమర్షియల్ ఫార్మెట్ తో ఆకట్టుకుంది. రెండు పంచ్ డైలాగ్స్.. యాక్షన్ సీన్స్.. విజువల్స్ గ్రాండీయర్ తో టీజర్ ను నింపేశారు. బలుపు తర్వాత గోపీచంద్ మలినేని హిట్ చూడలేదు. హీరో, దర్శకుడు.. గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ క్రాక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ హిట్ కోసం తహతహ లాడిపోతున్నాడు. ఇప్పుడున్న అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడూ వేయని ప్లాన్స్ వేస్తున్నాడు. మాస్ మహారాజు రవితేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన డైలాగుల కోసమే క్యూ కడతారు ఆయన అభిమానులు. కొత్త సినిమాలో తమ అభిమాన హీరో డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: