బాహుబలి... టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సినిమాకు ముందు... తర్వాత. ఒకరకంగా ఇండియన్ సినిమా కూడా. అవును ఆ రేంజ్ లో చెప్పుకునే సినిమా ఇప్పటి వరకు చూడలేదు. వసూళ్ళ పరంగా అయినా మరొకరకంగా అయినా ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే మాట్లాడింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను తిరగ రాసింది అనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. 

 

ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని విమర్శించడానికి కూడా ఈ సినిమాను వాడుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని రాజమౌళి దృశ్య కావ్యం గురించి ప్రపంచం మాట్లాడుతుంది. ట్రంప్ రాకకు స్వాగతం చెప్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్ ఫోటో ని మార్ఫ్ చేసి బాహుబలి లో యుద్ధం సీన్ తో పాటుగా కొన్ని సన్నివేశాలకు జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీన్ని ట్రంప్ కూడా షేర్ చేసారు. 

 

దీనితో ఈ సినిమా గురించి అందరూ మరొకసారి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. దీనిపై రాజమౌళి అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి సినిమాను మరో దర్శకుడు చేయలేరు అని ఆ సినిమాకు ఎప్పటికి చావు ఉండదని, ఆ సినిమా ఏదోక సందర్భంలో ప్రపంచం లో ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది అంటున్నారు. అసలు రాజమౌళి రేంజ్ అది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా గురించి చర్చలు జరగడం మాత్రం నిజంగా అభినందించదగిన విషయమే. సినిమా వచ్చి మూడేళ్ళు అవుతున్నా సరే ఈ సినిమా ఇంకా నానుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: