ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, లెజెండరీ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో మరొక హీరో అయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన రావడం జరిగింది. 

 

హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, ఇక గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అరవిందసమేత మాదిరిగా కాకుండా ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ని జోడించనున్నారట త్రివిక్రమ్. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి , ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మెయిన్ రోల్ చేయనున్న ఈ సినిమాలో, గోవా భామ ఇలియానా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు చెప్తున్నారు. 

 

సినిమాని మలుపు తిప్పే ఇలియానా పాత్ర, సినిమాకు ఎంతో కీలకం అని, అలానే దీనితో ఆమెకు కెరీర్ పరంగా ఆమెకు మంచి బ్రేక్ రావడం ఖాయం అని అంటున్నారు. గతంలో పవన్ తో కలిసి జల్సా, బన్నీ తో కలిసి జులాయి సినిమాల్లో ఇలియానాని హీరోయిన్ గా తీసుకున్న త్రివిక్రమ్, ఈ సినిమాలో ఆమె కోసమే ప్రత్యేకంగా ఈ రోల్ ని రాయడం జరిగిందని, అలానే ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం, టాలీవుడ్ లో ఇలియానాకు మంచి బ్రేక్ లభించడం ఖాయం అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: