మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం '99 సాంగ్స్‌'తో మరోకొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్. జియో స్టూడియోస్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న రెహమాన్. నిర్మాత, రచయిత గానూ వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈచిత్రం.. వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

 

ఏఆర్ రెహమాన్.. దేశఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింపజేసిన సంగీతదర్శకుడు. చయ్య చయ్య అని మెస్మరైజ్ చేసినా..జయహో అంటూ స్ఫూర్తినింపినా అది రెహమాన్ కే చెల్లింది. ఆయన సంగీత దర్శకత్వంలో మేలిముత్యాల్లాంటి పాటలు జాలువారాయి.

 

మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం '99 సాంగ్స్‌'తో సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మరో కొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, రచయితగానూ వ్యవహరిస్తున్నారు. కొత్త బాధ్యతల నిర్వహణ  సవాలుగా ఉందని ఈ ఆస్కార్‌ అవార్డు గ్రహీత తెలిపారు.  

 

ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. ఈ చిత్రంలో రచయిత, నిర్మాత తానే కావడంతో.. చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు రెహమాన్.

 

అందుకే  ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో తెరకెక్కించినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం వరకు పడిన కష్టానికి ఫలితం... .. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఈ చిత్రాన్ని అంబానీకి చెందిన జియో స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నట్లు రెహమాన్ తెలిపారు. 

 

99 సాంగ్స్‌ చిత్రానికి విశ్వేశ్‌ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు. హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్‌ భట్‌, ఎడిల్సే వర్గాస్‌లు పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్‌ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రే కూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు.  హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి రెహమాన్ తనలోని మరో టాలెంట్ ను చూపించబోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: