యాంక‌ర్ సుమ.. బుల్లి తెర మీద మకుటం లేని మహారాణి.  రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. ఆమె మాటలు గలగల పారేటి గోదావరి సరిగమలు. ఆమె పలుకులు తన్మయంతో నాట్యం చేసేటప్పుడు కాలి గజ్జెలు చేసే చప్పుళ్ళకు సమానమైన వినసొంపైనవి. ఇక ఈమెది ఏదైనా షో స్టార్ట్ అయ్యిందంటే చాలు.. మహిళలు తమ పనులన్నింటికీ కాసింత బ్రేక్ ఇచ్చి.. వాళ్ళ  ఫేస్  ను టివి వైపు, ఆమె చేసే ప్రోగ్రామ్ వైపు టర్నింగ్ ఇచ్చుకుంటారు.

 

అంత‌లా ఎట్రాక్ట్ చేస్తుంది సుమ‌.  రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విష‌యం కాదు. కానీ సుమ మాత్రం చేసి చూపించింది. పైగా తెలుగమ్మాయి కూడా కాదు. ఎక్క‌డో కేర‌ళ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి తెలుగు తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా మాట్లాడుతుంది సుమ క‌న‌కాల‌.   ఈవెంట్లు, రియాల్టీ షోలు, గేమ్‌ షోలు, ఆడియో ఫంక్షలు ఇలా ఒకటేంటి.. తదితర ఫంక్షన్లకు కూడా సుమనే హోస్టుగా ఉండాలని చాలా మంది హీరోలు పట్టుబడుతూంటారు. ఇప్పుడు ఈమె తన ఇమేజ్‌ను బుల్లితెరతో పాటు సోషల్ మీడియా, డిజిటల్‌‌కు కూడా పాకేలా చేసింది. 

 

ఈ మధ్యే సుమక్క అనే యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో కొన్ని ఫన్నీ వీడియాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పోస్ట్ చేస్తుంది. అయితే సుమ మొదట సీరియల్ ద్వారానే టెలివిజన్ తెరకు పరిచయం అయ్యారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. అయితే రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ సుమ సీరియల్ రంగంలోకి రాబోతుంది. స్టార్ మా ఛానెల్ ద్వారా సుమక్క ఓ సరికొత్త కామెడీ సీరియల్ తో ప్రేక్ష‌కుల‌ను అలరించనున్నారు.”హౌస్ ఆఫ్ హంగామా” పేరిట తాజాగా అనౌన్స్ చేసిన ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ సీరియల్ కు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసారు. మరి మన స్మాల్ స్క్రీన్ దగ్గర ఈ కామెడీ సీరియల్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: