టాలీవుడ్ లోకి పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో హీరోగా తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. అప్పటి వరకు చిరంజీవి రీ ఎంట్రీపై రక రకాల రూమర్లు వచ్చాయి.. కానీ ఈ మూవీ చూసిన తర్వాత అన్నీ పటాపంచలు అయ్యాయి. మెగాస్టార్ సూపర్ హిట్ అందుకున్న తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. దాంతో చిరు తన తదుపరి సినిమా పై దృష్టి పెట్టారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు మెగాస్టార్.
ఈ సినిమా దేవాలయాల మాఫియా.. అక్రమాల నేపథ్యంలో ఉండబోతుందట. ఈ మూవీలో చిరంజీవికి సంబంధంచిన ఓ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ఈ లుక్ చూస్తుంటే మెగా స్టార్ ఓ నక్సలైట్ పాత్రలో కనిపించినట్లు అనిపిస్తుంది. ఈ మూవీలో చిరు ఓ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నారని అన్నారు. అయితే ఈ లుక్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉంది. గతంలో ఖైదీ సినిమాలో తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపించారు. ఆ లుక్ లో ఎర్రరుమాలు కట్టుకొని అడవిలో అన్నలా కనిపించాడు.
చాలా కాలం తర్వాత ఆ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే ఈ మూవీలో చిరు రెండు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాట. ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ లుక్ లో కనిపిస్తాడట.. అప్పుడు రామ్ చరణ్ ఆ పాత్రలో నటిస్తున్నాని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అంతే కాదు నక్సల్ గా మహేష్ బాబు కూడా నటించబోతున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. ఇందుకోసం ఆయన మహేష్ ని కూడా ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి.