నాని నిర్మాతగా నూతన దర్శకుడు శైలేహ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హిట్. సినిమా టైటిలే హిట్ అని పెట్టి ఆ టైటిల్ జస్టిఫికేషన్ చేసే కంటెంట్ తో వస్తున్నాం అంటున్నాడు నాని. విశ్వక్ సేన్, రుహాని శర్మ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమౌళి, రాఘవేంద్ర రావు, రానా, అనుష్కలతో పాటుగా టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల బ్యాచ్ అంతా ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

 

ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది స్వీటీ అనుష్క. రెండేళ్ల క్రితం భాగమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో రుద్రమదేవి పాత్రలో మెప్పించింది. నానితో మంచి పరిచయం ఉన్న అనుష్క హిట్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చింది. ఈవెంట్ కు తను గెస్ట్ గా రాలేదని ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి వచ్చానని చెప్పింది అనుష్క. అ! సినిమా టైంలో కూడా అనుష్కని ఇన్వైట్ చేశాడు నాని. 

 

చాలా కాలంగా మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడని అనుష్క హిట్ ఈవెంట్ కోసం రాక తప్పలేదు. ఇక మొన్నామధ్య కొద్దిగా సన్నబడినట్టు అనిపించినా మరి మునుపటి నాజూకు రూపమైతే రాలేదు చెప్పొచ్చు. సైజ్ జీరో కోసం బరువెక్కిన అనుష్క ఇంకా ఆ బరువు తగ్గించుకునే ప్రయత్నంలోనే ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్ధం సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. హిట్ ఈవెంట్ లో అనుష్కని చూసిన ఆమె ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. అప్పటికి ఈవెంట్ వ్యాఖ్యతగా చేస్తున్న సుమ కూడా మీ మీద తప్పిపోయిన కేసు ఉందని ఆమె ఈమధ్య కనిపించని కారణంతో సెటైర్ వేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: