నేచురల్ స్టార్ నాని రేపు తన 36 వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు ఈ సందర్భంగా రెండు సప్రైజ్ లను ప్లాన్ చేశాడు నాని. అందులో ఒకటి సరిగ్గా ఈరోజు అర్ధరాత్రి 12గంటలకు రివీల్ కానుండగా  రేపు సాయంత్రం 4:05 గంటలకు మరో అప్డేట్ ను రివీల్ చేయనున్నాడు. అందులో భాగంగా  వి సినిమా నుండి ఒక అప్డేట్ రానుండగా నాని  27వ చిత్రం టైటిల్ మరియు డైరెక్టర్ ను రేపు సాయంత్రం ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. 
 
ఇక వి సినిమా విషయానికి వస్తే మల్టీ స్టారర్  గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని తోపాటు యంగ్ హీరో సుధీర్ బాబు నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.  ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాని విలన్ పాత్రలో నటించగా  సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నివేత థామస్ ,అధితి రావ్ హైదరి హీరోయిన్లు గా నటించారు.  నాని 25వ సినిమా గా వస్తున్న వి ఉగాది కానుకగా మార్చి 25న విడుదలకానుంది. 
 
ఇదిలావుంటే నాని ప్రస్తుతం  శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఈచిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ , తమిళ నటి ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా నాని మిడిల్ క్లాస్ అబ్బాయి గా కనిపించనున్నాడు. ఇక నాని అన్నయ్య గా జగపతి బాబు నటించనున్నాడని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై లో ఈ చిత్రం విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: