టాలీవుడ్ సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, తన సినిమా షూటింగులకు ఎప్పటికప్పుడు టైం కు హాజరయ్యేవారట. ఇక ఎండ వచ్చినా వాన వచ్చిన కృష్ణ గారు కరెక్ట్ టైం కి షూటింగ్ స్పాట్ కి రావటం గమనించిన మరికొందరు ఇతర నటులు కూడా అప్పట్లో టైం కు వచ్చేవారట. ఆ విధంగా కెరీర్లో ఎంతో క్రమశిక్షణ, పక్కా ప్లానింగ్ తో పాటు శ్రద్దతో ముందుకుసాగారు కృష్ణ. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో, తన పెద్ద కుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేసిన కృష్ణ, ఆయనను నటుడిగా నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయితే సమయం కలిసిరాక అవి సఫలం కాలేదు. 

 

అదే సమయంలో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చిన్నకుమారుడు మహేష్ బాబు, చిన్న వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించాడు. ఇక తర్వాత రాజకుమారుడు తో హీరోగా పరిచయమైన మహేష్, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే వ్యక్తిగతంగా తండ్రి కృష్ణ అంటే అమితమైన ప్రేమాభిమానాలు గల మహేష్ బాబు కు, కృష్ణ అంటే కొంత భయం కూడా ఉందని సమాచారం. మొదటి నుండి షూటింగ్స్ కు కానీ లేదా ఏదైనా పని తలపెట్టినప్పుడు కానీ ఎప్పటికప్పుడు పంక్చువాలిటీని పాటించాలని కృష్ణ చెబుతుండేవారని, అలానే ఎప్పుడైనా అనుకున్న సమయం కన్నా లేటుగా వచ్చినట్లయితే, మహేష్ ని కృష్ణ కొంత మందలించేవారిని సమాచారం. 

 

అయితే ఒక రకంగా అది భయం కాదని, క్రమశిక్షణ, పద్ధతిని నేర్పడం అని, మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆ రెండు విషయాలను కనుక మనం పెడచెవిన పెట్టినట్లయితే, మన జీవితం సక్రమంగా సాగదని, అందుకే మహేష్ ని కూడా ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుండి కృష్ణ హెచ్చరించే వారిని, అందుకే వయసు పెరిగే కొద్దీ మహేష్ లో కూడా తండ్రి కృష్ణ మాదిరిగానే ఎంతో క్రమశిక్షణ, పద్ధతి అలవాటయ్యాయని ఇప్పటికీ కొందరు నటులు సీనియర్ విశ్లేషకులు చెప్తూనే ఉంటారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: