తెలుగు టెలివిజన్ కామెడీ షో లలో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులను అలరించిన షో జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ముఖ్యంగా షోల్లో యాంకరింగ్ చేసే రేష్మి తో సుడిగాలి సుధీర్‌ చేసే హడావిడి మరియు వేసే పంచులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అదే సమయంలో వారిద్దరిపై వార్తలు రూమర్లు వల్ల ఇద్దరికీ మంచి పాపులారిటీ రావడం జరిగింది. జబర్దస్త్ షో మాత్రమేగాక ఈ టీవీ రంగంలో ఇంకా అనేక షోలలో సుడిగాలి సుధీర్‌ తనకంటూ సెపరేట్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకుని టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది.

 

ఒక పక్క బుల్లితెరపై రాణిస్తున్న సుడిగాలి సుధీర్‌ మరోవైపు ఇండస్ట్రీలో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్లు చేస్తూ కూడా మొన్నటివరకు రాణించారు. అయితే రీసెంట్ గా సినిమా హీరోగా సాఫ్ట్‌వేర్‌ సుధీర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. అయితే సినిమా దారుణంగా ఫ్లాప్ కావటంతో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు సుధీర్. మేటర్ లోకి వెళితే ఇంకెప్పుడూ కెరియర్లో సినిమా హీరోగా చేయకూడదు అని డిసైడ్ అయ్యాడట. పొరపాటున హీరోగా మళ్లీ సినిమా చేస్తే ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ రంగంలో కూడా ఉన్న పాపులారిటీ పోయే అవకాశం ఉన్నది అని సుడిగాలి సుధీర్ గట్టిగా గుర్తించడం జరిగిందట.

 

దీంతో ఇండస్ట్రీలో ఎవరైనా ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా బుల్లితెర ని వదిలి పోనని, ఇకమీదట సినిమాలు చేయనని చెప్పుకున్నారు. మెల్లగా ఎలాగోలాగ తన ఇమేజ్ ని బుల్లితెర మీదనే పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నానని, లేని పోనీ ప్రయోగాలతో తన జీవితాన్ని పాడు చేసుకోనని సుధీర్ గట్టిగా డిసైడ్ అయినట్లు సమాచారం. చాలామంది టెలివిజన్ రంగంలో సూపర్ డూపర్ గా కెరియర్ కొనసాగించిన వాళ్ళు వెండితెరపై హీరో గా కనిపించాలని కెరీర్ మొత్తం పాడు చేసుకున్న వాళ్లు చాలామంది ఉండటంతో సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: