అందాల తార.. అతిలోక సుందరి.. సౌత్ ఇండియాకు ముద్దు బిడ్డ. బాల్యం నుండి అందరికి పరిచయం ఉన్న అద్భుత నటి శ్రీదేవి. అలాంటి తార.. అర్ధాంతరంగా రెండేళ్ల కిందటా సరిగ్గా ఈరోజున దుబాయ్ బాత్రూమ్ లో మరణించింది. ఆమె మరణం సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆమె మరణాన్ని రామ్ గోపాల్ వర్మ లాంటివారు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

అలాంటి అద్భుత నటి మరణం ఇప్పటికి ఒక రహస్యమే.. ఒక మిస్టరీ ఏ. అప్పట్లో ఆమె మరణం ఒక సంచలనం సృష్టించింది. అలాంటి ఆమె మరణం గురించి మొన్న ఈ మధ్యే సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆ సంచలన నిజాలు ఏంటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. 

 

సత్యార్థ్‌ నాయక్‌ అనే ఓ రచయిత శ్రీదేవి బయోగ్రఫీని ఎంతో అద్భుతంగా రాసింది. ఆ బయోగ్రఫీ చదివితే శ్రీదేవి మన కళ్ళ ముందే కనిపిస్తుంది.. ఈ సంగతి ఆ పుస్తకం చదివిన వారికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో శ్రీదేవి మరణానికి కారణం ఏంటో ఆమె చెప్పారు. ఆ కారణం తెలుసుకున్న వారందరు గుండెలు బాదుకుని మరి ఏడ్చారు.. 

 

ఆ నిజాన్ని శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద సమాచారం సేకరించి ఆ రచయత బయట పెట్టారు. అయితే ఆ నిజం ఏంటి అంటే? 'శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉందని 'చాల్బాజ్‌' అనే దర్శకుడు పంకజ్‌ పరాషర్‌, నాగార్జున ఆమెతో చెప్పినట్టు.. గతంలో వారితో కలిసి సినిమా తీస్తున్న సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో కళ్లుతిరిగి కిందపడ్డారని...  ఆ తర్వాత ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో పడిపోయారని, ఆమె ముఖానికి గాయమై, రక్తం వచ్చిందని ఆమె మేనకోడలు అయినా మహేశ్వరి కూడా చెప్పినట్టు ఆమె చెప్పారు. 

 

ఆమె వాకింగ్‌ చేసే సమయంలోను కొన్నిసార్లు శ్రీదేవి కుప్పకూలిపోయిందని బోనీ కపూర్‌ చెప్పారని. ఆమె రాసినట్లే ఆమె తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారు అని ఆమె ఓ ఆంగ్ల మీడియాతో రెండు నెలల క్రితం చెప్పారు. దీంతో ఆ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.. శ్రీదేవి మరణానికి అసలు కారణం ఇదా అని శ్రీదేవి అభిమానులు అంత బాధపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: