బుల్లితెర యాంకర్ గా చేయడం అంటే ఏదో నోటికి వచ్చింది మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. దానికో టైమింగ్, పర్ఫెక్షన్, కాన్ ఫిడెన్స్, క్లవర్ నెస్, విషయ పరిజ్ఞానం ఇలా చాలానే ఉండాలి. అవన్ని ఉన్నాయి కాబట్టే రెండు దశాబ్ధాలుగా హోస్ట్ అంటే ముందు గుర్తొచ్చే పేరు సుమ అనిపించేలా చేసుకుంది. దేవదాస్ కనకాల కోడలు.. రాజీవ్ కనకాల భార్యగా కన్నా సుమ తనకు తానుగా టివి హోస్ట్ గా కొత్త క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెర మీద రకరకాల షోస్ చేస్తూనే స్టార్ సినిమాల ఈవెంట్ లకు స్పెషల్ హోస్ట్ గా పనిచేస్తుంటారు.

 

ఈ హోస్టింగ్ కోసం సుమ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచుతారు. ఇక లేటెస్ట్ గా క్యాష్ షోలో తనలా యాంకరింగ్ చేస్తున్న టి.ఎన్.ఆర్, జాఫర్ ఇద్దరు షోలో పాల్గొన్నారు. అందులో జాఫర్ తన వృత్తిలో భాగంగా ముఖాముఖి బదులుగా నోస్ టూ నోస్ అనే ఇంటర్వ్యూ చేశాడు. అందులో భాగంగా సుమ భర్త రాజీవ్ కనకాల రెమ్యునరేషన్ ఎంత.. సుమ ఒక షోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. రాజీవ్ కన్నా సుమే ఎక్కువ సంపాదిస్తుందా.. అన్న ప్రశ్నలు వేశాడు.

 

దీనికి సమాధానంగా సుమ దీనికి కామెంట్స్ గా నీకెందుకురా అని పెడతారని పంచ్ వేసింది. సుమ అలా అనడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. రాజీవ్ కనకాల కన్నా సుమే ఎక్కువ సంపాదిస్తుంది. ఆమె చేస్తున్న షోలు చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. రాజీవ్ కూడా తన కన్నా సుమ సంపాదనే ఎక్కువ అని ఒప్పుకున్నాడు. అయితే అది ఎంత అన్నది మాత్రం చెప్పలేదు. సుమ బాగా కష్టపడుతుందని.. 8,9 గంటల పాటు కెమెరా, లైటింగ్ తో గడిపెస్తుందని.. అలా చేయడం చాలా కష్టమని అన్నాడు రాజీవ్ కనకాల.
  

మరింత సమాచారం తెలుసుకోండి: