నేడు అందాల తార శ్రీదేవి వర్ధంతి... ఆమె తన అభిమానులను, ఈ లోకాన్ని విడిచి వెళ్లి నేటికి రెండేళ్ళు అవుతుంది. భారతీయ సినిమాలో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న ఆమె ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దాదాపు అందరి అగ్ర హీరోల తో సినిమాలు చేసిన ఘనత ఆమె సొంతం. తెలుగు నుంచి హింది వరకు ఆమె దాదాపు 6 భాషల్లో నటించారు. హీరోయిన్ అంటే శ్రీదేవి ముందు, శ్రీదేవి తర్వాత అనుకునే స్థాయిలో ఆమె చెరగని ముద్ర వేసారు. 

 

ఆమెకు తిరుమల శ్రీవారికి ప్రత్యేక అనుబంధం ఉండేది. శ్రీదేవి ఏటా ఆగస్టు 13న పుట్టినరోజును తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో మాత్రమే జరుపుకొనే వారు. శ్రీదేవి పిన్ని కుమార్తె ప్రసన్నలక్ష్మి స్విమ్స్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేసారు. దీనితో శ్రీదేవి తిరుపతి వస్తే ఆమె ఇంట్లోనే ఉండేవారు. అయితే బోనీ కపూర్ తో వివాహం తర్వాత వాళ్లకు దూరంగా ఉన్నారు. శ్రీదేవి కి ముందు నుంచి కూడా తిరుమల శ్రీవారి విషయం లో ప్రత్యేక భక్తిని చాటుకునే వారు ఆమె. 

 

తాను ఎంత బిజీ గా ఉన్నా సరే ప్రతీ ఏటా ఏదోక సందర్భం లో ఆమె శ్రీవారిని దర్శించుకునే వారు. ఇప్పటికీ తన కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు. ఇక శ్రీదేవి తాతయ్య కటారి వెంకట స్వామి రెడ్డి తిరుపతి- గ్యారపల్లి- జమ్మలమడుగు మధ్య బస్సులు నడిపేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు బాల సుబ్రహ్మణ్యం కాగా, తర్వాత రాజేశ్వరమ్మ, సుబ్బరామయ్య, అనసూయమ్మ, అమృతమ్మ, శాంతమ్మ జన్మించారు. అందరూ తిరుపతిలోని 93-టీకే వీధి లోని ఇంట్లో ఉండేవారు. ఇలా తిరుపతిలోనే ఆమె మూలాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలను కూడా ఆమె అక్కడ షూట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: