అతిలోక సుందరి శ్రీదేవి... ఆమె సినిమాలు, ఆమె వ్యక్తిత్వం, ఆమె తపన, ఆమె పట్టుదల ఒక శ్రీదేవి, ఒక సావిత్రి... ఒక సినిమా. వీళ్ళు సినిమాను ప్రేమించారు ఆరాధించారు. కోట్లాది మంది అభిమానుల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నారు. ఇద్దరు కూడా ఒకసారి పెళ్లి అయి పిల్లలు ఉన్న వ్యక్తులనే పెళ్లి చేసుకున్నారు. సావిత్రి నా కూడా జెమిని గణేషన్ కోసం నా అన్న వాళ్ళను వదులుకున్నారు. ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి గాను తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టారు సావిత్రి. శ్రీదేవి కూడా దాదాపుగా అంతే... 

 

ప్రేమించిన వాడి కోసం నా అన్న వాళ్ళను వదిలేసారు. రెండో పెళ్లి చేసుకున్న వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటీ అంటూ ఎందరో అభిమానులు ఆమెకు లేఖలు రాసారు. మీడియా కూడా ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. సినీ పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉన్న ఎందరో ప్రముఖులు వివాహం వద్దని వారించారు. కుటుంబ సభ్యులు అయితే నీ కోసం రాజులే దిగి వస్తారు. అతను ఎందుకు అన్నారు. అయినా సరే శ్రీదేవి మాత్రం ఎవరి మాట వినలేదు. ప్రేమించిన వాడే ప్రాణం అనుకుంది. 

 

ఆయనతో జీవితం కొనసాగించింది. చచ్చిపోయే వరకు, చివరి శ్వాస కూడా ఆయనకు దగ్గర గానే విడిచింది శ్రీదేవి. కోట్లాది మంది అభిమానులకు ఆమె మౌనం తోనే సమాధానం చెప్పింది గాని, ఎక్కడా కూడా బోనీ కి దూరంగా ఉండలేదు. ఆమె హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీ కపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకుంది. వారిద్దరికీ జాన్వీ , ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు జాన్వీ  హీరోయిన్ గా నటిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తుంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: