‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఘోర పరాజయం చెందడంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండను నమ్ముకుని పాన్ ఇండియా మూవీగా ఛార్మీ కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్న ‘ఫైటర్’ మూవీ విషయమై ప్రస్తుతం పూరీ విపరీతమైన టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ ను నేషనల్ స్టార్ గా బాలీవుడ్ గుర్తించే విధంగా ప్రమోట్ చేయడం అంత సులువైన పని కాదని ఈ మూవీకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్  జోహార్ భావిస్తున్నట్లు టాక్.


దీనితో ఈ మూవీ విడుదల అయ్యేంత వరకు మరే కొత్త సినిమా ఒప్పుకోవద్దని అదేవిధంగా తన కొత్త సినిమాలకు సంబంధించిన కథలు కూడ వినద్దని పూరీ కరణ్ జోహార్ లు విజయ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యే వరకు వీలైనంత ఎక్కువ సమయం హైదరాబాద్ వాతావరణానికి దూరంగా తమతో ముంబాయిలో ఉండమని విజయ్ పై వ్యూహాత్మక ఒత్తిడి పూరీ చేస్తున్నట్లు టాక్. 

 

ఇది ఇలా ఉండగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఘోర పరాజయం చెందడంతో ఈ మూవీ నిర్మాత కెఎస్ రామారారావు పీకల లోతు కష్టాలలోకి వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లు కెఎస్ రామారావు పై నష్ట పరిహారం కోసం ఒత్తిడి చేస్తున్న పరిస్థితులలో విజయ్ దేవరకొండను కలిసి అతడికి ఇచ్చిన పారితోషికంలో కొంత భాగం బయ్యర్లకు సద్దుబాటు చేయమని కోరినట్లు టాక్. 


అయితే ఈ సూచనకు విజయ్ ఏమాత్రం స్పందించకుండా ఈ మూవీ ఫెయిల్యూర్ కు దర్శకుడు క్రాంతి మాధవ్ కారకుడు అంటూ తన వాదన వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బయ్యర్లకు ఎంతోకొంత సద్దుబాటు చేయకపోతే ఆ ప్రభావం విజయ్ భవిష్యత్ సినిమాల మార్కెట్ పై ఉంటుంది అని చెప్పినా విజయ్ పట్టించు కోకుండా ముంబాయి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: