అందాల తార శ్రీ‌దేవి గురించి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా 1967లో కన్దన్ కరుణై అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టింది. అలా కెరీర్ ను స్టార్ట్ చేసినామో అన‌తికాలంలోనే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు. త‌న అందం, అభిన‌యంతో వెండి తెర‌పై అతిలోక సుంద‌రిగా కోట్లాదిమంది ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌రాని ముద్ర వేశారామె. అయితే  2018లో ఎవ్వరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచివెళ్ళిన శ్రీదేవి చాలామంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

 

2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్ టబ్‌లో మునిగి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆ హఠాత్ పరిణామం తన కుటుంబసభ్యులనే కాకుండా యావత్ సినీప్రపంచాన్ని శోకసముద్రంలో ముంచేసింది. ఇక ఆమె సినీ కెరీర్ ఒకసారి పరిశీలిస్తే, 54 ఏళ్ళ తన జీవితంలో 4 ఏళ్ళ వయసులో మేకప్ వేసుకోగా.. ఆమె చనిపోయే ముందు వరకు నటించడం జరిగింది. మధ్యలో ఒక రెండు దశాబ్దాల పాటు కెమెరాకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆమెకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. శ్రీదేవి టాప్ పొజిషన్లో దూసుకెళుతున్న రోజుల్లో అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దివ్య భారతి అనతి కాలంలోనే వరుస సినిమాలతో దూసుకెళ్ళింది.

 

అప్పట్లో ఆమెను అంతా యంగ్ సిస్టర్ ఆఫ్ శ్రీదేవి అని పిలుస్తుండేవారు. దివ్యభారతి అందం, జోరు చూసిన వారంతా ముందు వరుసలో కొనసాగుతున్న శ్రీదేవిని పక్కకు నెట్టి ఆ ప్లేసును దివ్య భారతి చేజిక్కించుకుంటుదని అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో ఆమె 1993లో బాల్కనీ నుండి కింద పడిపోయి అనుమానాస్పదంగా మరణించారు. దివ్యభారతి ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్ల కాలంలో ఆమె దాదాపు 13 సినిమాల్లో నటించ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే దివ్యభారతి మరణించే సమయానికి ఆమె సైన్ చేసిన కొన్ని సినిమాలు సగం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన సగం పూర్తయిన సినిమాలు అప్పట్లో శ్రీదేవితో పూర్తి చేశారు. ఇద్దరూ ఇంచు మించుగా ఒకే పోలికలతో ఉండటంతో శ్రీదేవి ఆ సినిమాలకు బాగా సూటయ్యారు. అందుకే ద‌ర్శ‌కులు దివ్యభారతి ప్లేస్‌లో శ్రీ‌దేవిని ఎంచుకునేవారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: