గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో  రాజధానుల విషయం కీలకంగా జరుగుతుంది. అమరావతి నుంచి కాదని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు సిఎం జగన్.  దీనిపై అమరావతి రైతులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.  అంతే కాదు ఇదే విషయంపై ప్రతిపక్ష నేతలు ఓ రేంజ్ లో పోరాడుతున్నారు. రైతులను అన్యాయం చేస్తావా అంటూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అయితే ఢిల్లీ స్థాయిలో రచ్చ చేస్తున్నారు.  ఇక పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు ఉంటే అభివృద్ది జరుగుతుందని అధికార పార్టీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి వెళ్లి జగన్‌ను స్వయంగా కలిసి మూడు రాజధానుల నిర్ణయంపై సమర్థించాడు.  

 

తాజాగా ఈ విషయంపై ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజధాని విషయంలో ఇంతగా మాట్లాడాల్సిన పరిస్థితి లేదని.. అధికార పార్టీ ఏం చేసినా చెల్లుతుందని అన్నారు.  3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని ఆయన చెప్పారు. కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన అది రాజధాని కాదని.. అలాంటివి ఎప్పటికీ రాజధానులు కాలేవని చెప్పారాయన. ప్రజల సొమ్ముతో అమరావతి కోసం ఆరు, ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారని.. మరో రెండు వేల కోట్లు ఖర్చుపెడితే రాజధాని రెడీ అయిపోతుందని అభిప్రాయపడ్డారు.

 

ప్రభుత్వాలు మారినా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంపై వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో 2 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రాజధానులంటే ప్రజలకు నష్టం కలిగి అవకాశం ఉందని ఆయన అన్నారు.   ఇక అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు బూతులు తిట్టుకుంటున్నారని.. తెలుగువాడు అని చెప్పుకునేందుకే సిగ్గుపడేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: