ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పబడే అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత్య పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యాధినేత రెండు రోజుల భారత తొలి పర్యటనకు అధికారులు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 36 గంటల పర్యటన కోసం ఫిబ్రవరి 14న భారత్‌కు రానున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయినప్పటి నుంచి ఆయన షెడ్యూల్ పూర్తి టైట్‌గా ఉండనుంది. నమస్తే ట్రంప్ కార్యక్రమం నుంచి ఆగ్రా తాజ్‌మహల్ సందర్శన వరకు ట్రంప్ బిజీగా గడపనున్నారు. ఇక్కడ ఆయన ప్రయాణం, వివిధ వసతులకు సంబంధించిన వస్తువులు, హెలికాప్టర్‌లు ఇప్పటికే గుజరాత్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన పర్యటన ఏ క్రమంలో సాగనున్నదనే అంశంపై ఆసక్తి నెలకొంది.

 

విమానాశ్రయంలో అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతారు. సబర్మతీ ఆశ్రమంకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. అక్కడ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. ఇక ప్రధాని మోడీ ట్రంప్‌కు మహాత్ముడి మొమెంటో, మరియు చరఖాతో పాటుగా పుస్తకాలు బహూకరిస్తారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు డిఫెన్స్‌కు చెందిన యాంటీ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రంప్ పాల్గొనే నమస్తే ట్రంప్ బహిరంగ సభలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) యాంటీడ్రోన్లతో పహరా ఏర్పాటు చేశారు.

 

ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రజలు ఎలాంటి డ్రోన్లను వినియోగించవద్దని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.   పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ హోటల్‌ను కొద్ది రోజుల ముందే అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  ఏడు కంపెనీల క్విక్ రెస్సాన్స్ టీం జవాన్లు, 15 బాంబు డిటెక్షన్ స్క్వాడ్ లు, పోలీసు జాగిలాలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు, ఎయిర్ ఫోర్స్, అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులు నిరంతరం పహరా కాసేలా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: