శ్రీదేవి మరణం తరువాత ఆమె జీవితంలో జరిగిన ఎన్నో బాధకర సంఘటనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. ఆమె బాల్యం, వ్యక్తిగత జీవితం, పెళ్లి, తల్లి ఆరోగ్యం, సోదరితో వివాదం ఇలా ఎన్నోఅంశాలు శ్రీదేవి జీవితంలో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో శ్రీదేవి వివాహం అనూహ్య పరిస్థితుల మధ్య జరిగింది. సినిమాను తలపించే ఈ సంఘటన ఆమె జీవితంలో ఓ కోరికను ఎప్పటికీ నెరవేరకుండా చేసింది.

 

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న శ్రీదేవిని, అప్పుడు బాలీవుడ్‌లో యువ నిర్మాతగా ఉన్న బోనీ కపూర్‌ హిందీ తెరకు పరిచయం చేశాడు. ఆమెతో ఎన్నో సినిమాలు నిర్మించిన బోనీ, తొలి రోజుల్లో వ్యక్తిగతంగానూ శ్రీదేవికి సాయం చేశాడు. కథల ఎంపిక, హిందీ రాకపోయినా షూటింగ్‌లలో ఇబ్బందులు ఎదురుకాకుండా శ్రీదేవికి సాయపడ్డాడు. దీంతో అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లల తండ్రి అయిన బోనికి శ్రీదేవి దగ్గరైంది.

 

ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది. అయితే పెళ్లైన బోనిని పెళ్లి చేసుకునేందుకు శ్రీదేవి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. బోని కుటుంబం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే తమ ప్రేమ అన్నింటికన్నా గొప్పది అని నమ్మిన బోని శ్రీదేవిలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదని భావించిన ఈ జంట సాధాసీదా పెళ్లి చేసుకోకున్నారు.

 

చిన్నతనం నుంచి తన పెళ్లి విషయంలో శ్రీదేవి ఎన్నో కలలకు కంది. తన వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తన సన్నిహితులతో చాలా సార్లు చెప్పింది. కానీ బోనీతో ప్రేమ కారణంగా శ్రీదేవి కోరిక తీరలేదు. ఘనంగా పెళ్లి చేసుకోవాల్సిన శ్రీదేవి, ఓ సాధారణ మహిళల సాధాసీదాగా వివాహం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: