అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత దక్షిణాదిలో హీరోయిన్‌గా అడుగులు వేసి.. ఆపై బాలీవుడ్ తెరపై తన అందం అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. అయితే ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది.

 

ఈమె మరణవార్త విని ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. చిత్రసీమలో మూడు దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది అప్సరసను తలపించే అందం, అంతకుమించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసింది శ్రీదేవి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. అయితే అక్కినేని నాగేశ్వర రావు సరసన నటించిన శ్రీదేవి ఆయన తనయుడైన నాగార్జునకు జోడిగా నటించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో సినీ ఇండ‌స్ట్రీలో దీనిపై పెద్ద చ‌ర్చ‌లే న‌డిచాయి. అయిన‌ప్ప‌టికీ శ్రీ‌దేవి నాగార్జున‌తో నటించ‌డానికి ఒప్పుకుంది.

 

ఇక శ్రీ‌దేవి ఏఎన్నార్‌తో చాలా సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు నాగార్జున‌తో ఆఖ‌రి పోరాటం, గోవిందా గోవిందా చిత్రాల్లో న‌టించింది.  గోవిందా గోవిందా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో 1994లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. తిరుమల ఆలయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక కె.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో ఆఖ‌రి పోరాటం 1988లో విడుద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ రెండు సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. ఇక ముందు విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత‌ వీరి జంట, కెమిస్ట్రీ చాలా బాగుందంటూ ప్ర‌శ‌సంలు అందుకోవ‌డం విశేషం.
  

మరింత సమాచారం తెలుసుకోండి: