టాలీవుడ్ లోకి అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత నటించిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేదు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ మూవీలో మతిమరుపు పాత్రతో నాని అందరి మనసు దోచాడు.  ఈ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత నానికి అదృష్టం బాగా కలిసి వచ్చింది.  వరుసగా ఆయన నటించిన ఆరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. భారీగానే కలెక్షన్లు రాబట్టాయి.  దేవదాస్, కృష్ణార్జున యుద్దం కాస్త నిరాశ పరిచినా గత ఏడాది నాని నటించిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ మంచి విజయాలు అందుకున్నాయి.  ప్రస్తుతం నాని నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.  

 

గతంలో సుధీర్ బాబుకి సమ్మోహనం లాంటి మంచి హిట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ నానికి కూడా మంచి హిట్ అందించిన విషయం తెలిసిందే.  ఈ ఇద్దరితో ఆయన చేసిన సినిమాలు వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి. అలాంటి ఇంద్రగంటి ఈ ఇద్దరితో కలిసి 'వి' సినిమా చేశాడు. పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఒకటి రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే.. నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు. ఇప్పటి వరకు హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నాని ఇప్పుడు ఉన్నట్టుండి నెగిటీవ్ షేడ్స్ పాత్రలో ఎందుకు నటించాడన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి.  

 

అయితే  విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు. కానీ ఈ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట.  అది కూడా క్లయిమాక్స్ లో ఉండబోతుందట.. ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. మరి ఆ ట్విస్ట్ ఏంటో అన్నది ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.  మార్చి 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, నివేద థామస్ .. అదితీరావు నాయికలుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: