గతవారం విడుదలైన ‘భీష్మ’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సంవత్సరంలో రెండు నెలలు పూర్తి కాకుండానే క్రేజీ హీరోయిన్ రష్మిక వరసగా రెండు హిట్స్ కొట్టింది. ఈ సందర్భంలో తన జోష్ ను ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంటూ రష్మిక తనకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ను లీక్ చేసింది.


తనది చాల సాధారణమైన కుటుంబ నేపధ్యం అని చెపుతూ తాను పెద్దగా విలాసాలకు ఎక్కువ ఖర్చు పెట్టను విషయాన్ని చెపుతూ తనకు కోపం వస్తే మటుకు తాను ప్రవర్తించే వింత ప్రవర్తనను బయటపెట్టింది. సినిమా షూటింగ్ స్పాట్ లో తనకు ఆ సినిమా యూనిట్ పై కానీ లేదంటే ఆ మూవీకి సంబంధించిన దర్శకుడు హీరోలతో ఎవరి పై అయినా కోపం వస్తే తాను తన కోపాన్ని బయటపెట్టలేక ఒక విచిత్రమైన పనిని చేసి తాను తన కోపాన్ని తగ్గించుకుంటాను అని చెపుతోంది.


రష్మిక కు షూటింగ్ స్పాట్ లో కోపం రాగానే ఆ షూటింగ్ పూర్తి అయిన వెంటనే తన ఇంటికి కానీ హోటల్ కు కానీ వెళ్ళకుండా తనకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ కు వెళుతుందట. అలా వెళ్ళడమే కాకుండా అక్కడ తనకు కనిపించిన బట్టలు వివిధ రకాల లిప్ స్టిక్స్ తనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తనకు నచ్చినా నచ్చకపోయినా వరస పెట్టి కోనేస్తూ ఆతరువాత బిల్ చెల్లించి తన కోపాన్ని తీర్చుకుంటాన్న విషయాన్ని బయటపెట్టింది.


ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలోని విషయాలు బయటపడటంతో రష్మిక లా ఆమెను  అభిమానించే అమ్మాయిలు కూడ ఇలా తమ కోపాన్ని తీర్చుకోవడానికి షాపింగ్ మాల్స్ కు వస్తే బాగుండును అంటూ ఇప్పటికే బిజినెస్ పడిపోయిన చాల షాపింగ్ మాల్స్ యజమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం జోష్ లో ఉన్న రష్మిక ఇక్కడే ఇల్లు కొనుక్కుని సెటిల్ అవ్వడమే కాకుండా అర్థరాత్రి చార్మినార్ ను గోల్కొండను బురఖా వేసుకుని ఎవరికంటా పడకుండా చూడాలని రష్మిక ఆశ..     

మరింత సమాచారం తెలుసుకోండి: