టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే పట్టింది అల్లా బంగారమే అవుతుంది. వరుస సినిమా ఆఫర్లతో ఆమె దూసుకుపోతుంది. ఈ ఏడాది అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురములో సినిమా ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. దీనితో అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో అఖిల్ తో ఒక్కో సినిమా చేస్తుంది పూజ. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. అక్కడ కూడా అగ్ర హీరోలతో ఆఫర్లు కొట్టేసింది ఈ భామ. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ తో రెండు హిట్స్ కొట్టేసింది ఈ భామ. దీనితో ఈ సినిమాలో కూడా ఆమెనే తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే త్రివిక్రమ్ డ్రాప్ అయిపోయినట్టు సమాచారం. ఆమె తో సినిమా చేయడానికి పారితోషకం విషయంలో త్రివిక్రమ్ డ్రాప్ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే పూజతో చేసినందున మరో కొత్త హీరోయిన్ అయితే కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉంటుందని ఎన్టీయార్ సూచించాడట.

 

దీంతో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఇప్పటికే కథ కూడా త్రివిక్రమ్ సిద్దం చేసాడు. ప్రస్తుతం జూనియర్ బిజీ గా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది సినిమా. ప్రస్తుతానికి మే అంటున్నా జూన్ లేదా జూలై లో మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: