పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు జనసేన పార్టీ అధినేతగా  ఆంధ్ర రాజకీయాల్లో దూసుకుపోతునే...  మరోవైపు సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఓ వైపు శరవేగంగా సినిమాల చిత్రీకరణ చేస్తూనే మరోవైపు ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్  కళ్యాణ్.  ఇప్పటికే బాలీవుడ్ హిట్ మూవీ అయినా పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ అమితాబచ్చన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కించాడు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక మొన్నటివరకు రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉండడంతో షూటింగ్ కాస్త ఆగి పోయింది. ఇక నేటి నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. 

 

 

 ఈరోజు ఉదయం నుండి అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ 26వ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లో పవన్ కల్యాణ్ హాజరు కాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమాలోని కీలక నటీనటులు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో నటిస్తున్నారట. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను నేడు చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక  పింక్ రీమేక్ సినిమా కోసం  పవన్ కళ్యాణ్ అతి తక్కువ రోజులు డేట్స్ ఇవ్వటంతో... శరవేగంగా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేయడానికి కసరత్తులు చేస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. 

 

 

 కాగా ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్నారు. కాగా మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా లోకి వస్తారా అని పడిగాపులు కాసిన అభిమానులందరూ... ఇప్పుడు పవన్ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.దీంతో  పవన్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ... అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: