యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'హిట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మొత్తం ‘బాహుబలి’ టీమ్ అంతా కలిసి కట్టకట్టుకుని రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని  సొంత బ్యానర్ లో నిర్మించిన పరిస్థితులలో ఇలా ‘బాహుబలి’ టీమ్ అంతా కలిసి వచ్చారు అని భావించినా ఇలా అందరు కలసి రావడం వెనుక ఏదో ఒక కారణం ఉంది అన్న ప్రచారం  జరుగుతోంది.


రాజమౌళి రానా దగ్గుబాటి అనుష్క అతిథులుగా ఈ ఫంక్షన్ కు రావడంతో ఈ ఫంక్షన్ మంచి జోష్ వాతావరణంలో జరిగింది.  నాని కి రాజమౌళి తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం వాస్తవమే అయినా ఇలా అందరు ఏదో ఒక కారణంలేకుండా వచ్చి ఉంటారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తీసిన ‘ఈగ’ సినిమాలో నాని హీరోగా నటించిన సమయం నుండి నాని రాజమౌళి ల మధ్య మంచి సాన్నిహిత్యంకొనసాగుతోంది.  


రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో బిజీగా ఉన్నపటికీ ఈ మూవీ తరువాత రాజమౌళి తీయబోయే సినిమా పై క్లారిటీ లేదు. దీనితో నాని రాజమౌళి ల మధ్య ఒక మీడియం రేంజ్ సినిమా ఉంటుందా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి.  


ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ఈ మూవీ ఫంక్షన్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈ మూవీకి చూడానికి వచ్చే ప్రేక్షకులు ఎవరు మంచినీరు తాగి రావద్దని అలా వస్తే ఈ మూవీలో వచ్చే హారర్ సీన్స్ చూసి భయపడి అనేకసార్లు బాత్రూంకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అంటూ విశ్వక్ సేన్ అన్నమాటలు అతిగా అనిపించాయి. ఈ వారం విడుదల కాబోతున్న ఈ మూవీ సక్సస్ ను బట్టి నాని నిర్మాతగా మరిన్ని వెరైటీ సినిమాలు తీస్తాను అని నమ్మంకం పై ఉన్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: