సూపర్ స్టార్ మహేష్ బాబు విభిన్నమైన కథాంశంతో ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ... సంచలన విజయాలను నమోదు చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి  సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వసూళ్ళ పరంగా టాక్  పరంగా సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో అదే జోష్ లో  ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్ వెళ్లారు మహేష్ బాబు. అయితే ఇంకొన్ని రోజుల్లో టూర్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు రానున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో అనేదానిపై ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 

 మహేష్ బాబు  ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై... రోజుకో కొత్త దర్శకుడి పేరు తెరమీదికి వస్తూనే ఉంది. ఇంతకుముందు దర్శకుడు శ్రీను వైట్ల తో మహేష్ సినిమా ఉంటుందని అనుకోగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడి పేరు తెరమీదకి వచ్చింది... ఇక ఆ తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పేరు తెర మీదికి వచ్చి హల్ చల్ చేసింది. ఇలా రోజుకు ఒక దర్శకుడి పేరు తెర మీదికి వచ్చి మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా మరో దర్శకుడు పేరు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న మహేష్ బాబు ఈ సారి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలోనే మహేష్ బాబుకి గరుడవేగ ఫెమ్  ప్రవీణ్ సత్తారు వినిపించిన కథకు  ఓకే చెప్పాడు అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు వినిపించిన 80% కథకు మహేష్ సంతృప్తి చెందాడని మిగతా 20 శాతం కథ మహేష్ కి నచ్చితే ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎల్బిడబ్ల్యు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రవీణ్ సత్తారు ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా అంతగా విజయం సాధించలేకపోయాడు ఇక చివరికి హీరో రాజశేఖర్ తో గరుడవేగా అనే సినిమాను తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఏ స్టార్ హీరోని తెరకెక్కించిన అనుభవం లేదు ప్రవీణ్ సత్తారుకు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సత్తారు కథ మహేష్ బాబు ఓకే చెప్పినట్లు వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: