తెలుగు బుల్లితెరపై మెయిల్ యాంకర్ గా ప్రదీప్ మాచినేని కి ఎంతో మంచి పేరు ఉంది.  ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసిన ప్రదీప్ తాజాగా హీరోగా వెండి తెరపై కనిపించబోతున్నాడు.  వాస్తవానికి ఎప్పటి నుంచి ప్రదీప్ హీరోగా రావాలని చూసినా.. సరైన కథ సెట్ కాకపోవడంతో ఆలస్యం అవతూ వచ్చింది. అయితే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్  పాత్రల్లో కనిపించాడు  ప్రదీప్.   తాజాగా  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నారు. అయితే ఈ మద్య సినిమాల రిలీజ్ కన్నా ముందు లిరికల్ సాంగ్స్  సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ నటించిన  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు సంబంధించి ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటకు ఇప్పటివరకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే.

 

ఏకంగా మూడు కోట్ల మంది పాటను విన్నారు.  తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  ఈ సందర్భంగా యాంకర్ ఓ ఫన్నీ క్వచన్ ప్రదీప్ ని అడిగారు.  మీరు కాజల్ కి పెద్ద ఫ్యాన్ కదా.. ఒకవేళ ఆమెతో మీకు డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించాడు యాంకర్. ఆ ప్రశ్న వినగానే ప్రదీప్ నవ్వుతూ.. ముందైతే షాక్‌తో కళ్లు తిరిగిపడిపోతాను.

 

ఆ తర్వాత నన్ను నేను గిచ్చుకుని ఇదంతా నిజం కాదని అనుకుంటాను. ఒకవేళ అంత గొప్ప నటి డేటింగ్ కి వెళ్దాం అని అడిగితే.. ఊరుకోండి మేడం మీరు ఇలా జోక్స్ నాపై ఎందుకు వేస్తారని అంటానని అన్నారు. తాజాగా దీనిపై స్పందించిన నటి కాజల్.. ప్రదీప్.. ఇలాంటి కఠినమైన ప్రశ్నకు కాస్త క్రియేటివ్ ఆన్సర్ ఆలోచించు. నీ సినిమాకు ఆల్ ది బెస్ట్’ అని రిప్లై ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: