టాలీవుడ్ లో ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చిన వారు... అనుకోకుండా నటులుగా మారిన సందర్భాలు ఉన్నాయి.  అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన వారు అనుకోకుండా నటులుగా మారారు. అలాంటి వారిలో రవితేజ, నాని, రాజ్ తరుణ్ ఇలా ఎంతో మంది ఉన్నారు.   హీరోలు గా మారిన వారు కొద్ది మందే మంచి సక్సెస్ బాటలో నడిచారు.  తాజాగా టాలీవుడ్ లోకి నటుడు కావాలని ఎంతో ఆశతో వచ్చిన పీఎన్ రామచంద్రరావు దర్శక, నిర్మాతగా ఎలా యూటర్న్ తీసుకోవాలసి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  ఫ్యామిలీ, కామెడీ సినిమాలకు పెద్దపీఠ వేసిన ఆయన  'చిత్రం భళారే విచిత్రం', 'గాంధీ నగర్ రెండో వీధి' చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.

 

తాజాగా పీఎన్ రామచంద్రరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాది నెల్లూరు జిల్లాలోని 'పాలపల్లి' గ్రామం. చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరమంటూ ఒక ప్రకటన వచ్చింది.  కాకపోతే ఇనిస్టిట్యూట్ లో చేరాలంటే.. ఖచ్చితంగా 21 ఏళ్లు నిండి ఉండాలని రూల్.  అయితే నాకు అప్పటికీ 18 ఏళ్లు మాత్రమే ఉన్నాయి.. చిన్న వయసు. కానీ నటించాలన్న తపన ఎంతోఉండేది.  ఎలాగైనా సరే  ఇనిస్టిట్యూట్  చేరాలన్న ఆకాంక్షతో నాకు కబురు రాకపోయినా నేను చెన్నై వెళ్లాను. అక్కడ కొంత మంది సిబ్బంది నన్ను లోపలికి రానివ్వలేదు.. పైగా వెంటనే వచ్చిన దారిలోనే వెళ్లు అన్నట్లు మాట్లాడారు.

 

 దాంతో నాకు ఏం చేయాలో తోచలేదు.. అక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నాను.  అంతలో అక్కడికి దర్శక నిర్మాత 'డూండీ' వచ్చి నా గురించి మొత్తం తెలుసుకున్నారు.  అయితే ఆయన నువ్వు పొట్టిగా ఉన్నావ్.. నటుడివి కాలేవు. అయితే నీకు టాలెంట్ ఉంటే నటులనే తీర్చిదిద్దే దర్శకత్వ భాగంలోకి వెళ్లు అని సలహా ఇచ్చారు. ఇక సినీ పరిశ్రమలోకి రావాలన్న తపన ఉండటంతో నేను పీసీ రెడ్డి గారి దగ్గర 'కొత్త కాపురం' సినిమాకి గాను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను  అని చెప్పుకొచ్చారు. తర్వాత దర్శక, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: