ఏ ఇండస్ట్రీలో అయినా.. ఒక హీరోయిన్ పై ఏవైనా రూమర్లు వస్తే వాటిపై స్పందించడానికి అస్సలు ఇష్టపడరు.  ఒకవేళ తప్పని సరిపరిస్థితి వస్తే.. ఇలాంటి కామన్ అని కొట్టి పడేస్తుంటారు.  అయితే తనపై కాకుండా వేరే హీరోయిన్ పై రూమర్లు పుట్టుకు వస్తే ఏంటీ అని ప్రశ్నిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది బాలీవుడ్ నటి  అదితీ రావు హైదరీ.   అక్కినేని కోడలు సమంతపై ఎనలేని ప్రేమను కురిపించి మీడియాదే తప్పు అన్నట్టుగా మాట్లాడింది హైదరాబాద్ బ్యూటీ అదితి రావు హైదరి. ఒక నటి టాలెంట్‌ను ఒక్క చిత్రం  విజయం కానీ అపజయం కానీ జడ్జ్ చేయవని ఆమె అన్నారు.  శర్వానంద్ హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో ఈ మూవీలో హీరోయిన్‌గా సమంత ఫిక్స్ అయినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా  ఈ వార్తలను...రాసిన సంస్థలను ప్రస్థావిస్తూ హైదరాబాద్ బ్యూటీ   కడిగేసింది. ఒక విజయం లేదా పరాజయం నటీనటుల భవితను నిర్ధేశించలేవు. ఆ హీరోతో చిత్రం ప్లాప్ అయిందని తర్వాత మరో చిత్రం చేస్తే కలిసి రాదని ఎలా నిర్ధారించేస్తారు? జయాపజాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ప్రేక్షకులు మాత్రమే  అది డిసైడ్ చేసేది. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి. ఇంకొకటి సినిమాలోని పాత్రాధారుల వివరాలను సదరు దర్శకుడు గానీ నిర్మాత గానీ ప్రకటించేవరకు ఆగండి. థ్యాంక్యు' అని అదితీ  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. 

 

అయితే ఈ మద్య వరుస హిట్స్ అందుకుంటే వారిని అందలానికి ఎక్కించడం.. ఒక్క ఫ్లాప్ వచ్చినా.. వారి భవితవ్యం అగమ్యగోచరం అని చెప్పడం కామన్ అయ్యిందని ఇలాంటి వాటిపై నటీ, నటులు గగ్గోలు పెడుతున్నారు. శర్వానంద్ హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మహా సముద్రం చిత్రం విషయంలో అతిధి ఈ రకంగా స్పందించడంపై ఇండస్ట్రీవారు ప్రశంసిస్తున్నారు.  ఏది ఏమైనా  ఇండస్ట్రీలో ఇలా ఒకరి కోసం ఒకరు ఇలా బాసటగా నిలవడం.. ఎందో మంచి శుభపరిణామం అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: