తెలుగు లో వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ నమిత.  ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ తో సొంతం సినిమాతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు.  అదే సమయంలో కోలీవుడ్ లోకి జంప్ అయ్యింది.  అక్కడ నమిత పర్సనాలిటీ కి తగ్గుట్టు పాత్రలు రాావడంతో కోలీవుడ్ లో స్థిరపడింది. బొద్దుగా తయారైన నమిత తమిళ్ లో వ్యాంప్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ లో నటించింది.  హాట్ సీన్లతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  ఆ మద్య బిగ్ బాస్ లో పాల్గొని తన కాంట్రవర్సీతో తెగ హల్ చల్ చేసింది.  ఆమె కోరకున్న ప్రియుడితో వివాహం జరిగిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. 

 

అయితే చాన్స్ వస్తే మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్దం అంటుంది.  తాజాగా కాక్ టైల్   చిత్ర ఆడియో ఆవిష్కరణ  కార్యక్రమం  ఇటీవల చెన్నైలోని  ఒక కాలేజ్ లో  జరిగింది. ఈ  కార్యక్రమంలో  పాల్గొన్న నటి   నమిత  మాట్లాడుతూ  రొమాన్స్‌  సినిమాలు చూసి చూసి బోర్‌  కొట్టేసిందని  తెలిపింది.     ఛాయాగ్రాహకుడు  పీజీ.ముత్తయ్య, ఎం.దీప  కలిసి  పీజీ.మీడియా  వర్క్స్‌ పతాకంపై  నిర్మించిన  చిత్రం  కాక్‌టైల్‌. కామెడీ నటుడు  యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన  ఈ మూవీలో  ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్‌ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్‌  బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. 

 

ఈ మద్య కామెడీ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని.. థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షులు ఈ తరహా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నమిత పేర్కొంది.  ఆర్‌. విజయ్‌మురుగన్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి ఆర్‌జే.రవిన్‌ ఛాయాగ్రహణం, ఎస్‌.సాయిభాస్కర్‌ సంగీతాన్ని అందించారు. కాగా ఈ మూవీలో ఆస్ట్రేలియాకు చెందిన  కాక్‌టైల్‌  అనే పక్షి ప్రధాన పాత్రలో నటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: