కొన్నేళ్ల క్రితం ముందుగా బుల్లితెరపై ప్రసారం అయిన సంచలన సీరియల్ అమృతం. ముందుగా చిన్న కామెడీ సీరియల్ గా ప్రారంభం అయిన అమృతం, మెల్లగా ప్రేక్షకాదరణ పెంచుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. నిజానికి దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉన్న సమయంలో ఋతురాగాలు సీరియల్ ఎంత ఫేమస్ అయి ప్రేక్షకుల మదిని దోచిందో, అదే మాదిరిగా ఆ తరువాత జెమినీలో ప్రసారం అయిన కామెడీ సీరియల్ అమృతం కూడా మంచి పేరు దక్కించుకుంది. మొదట ఈ సీరియల్ ప్రధాన పాత్రలైన అమృతరావు పాత్రలో శివాజీ రాజా నటించగా, అంజి పాత్రలో గుండు హనుమంతవు నటించారు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వలన శివాజీ రాజా స్థానములో సీనియర్ నరేష్, ఆపై హర్షవర్ధన్ రావడం జరిగింది. 

 

కానీ ఆ సీరియల్ లో ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినప్పటికీ అమృతరావుగా గుండు హనుమంతరావే నటించారు. ఇక వారిద్దరితో పాటు సర్వం, అప్పాజీ పాత్రలు కూడా ఎప్పటికీ మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయాయి అనే చెప్పాలి. కాగా ఇటీవల అనారోగ్య కారణాల వలన గుండు హనుమంతరావు మరణించడం జరిగింది. ఇక ఆ సీరియల్ పూర్తి అయిన తరువాత కూడా దానిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినప్పటికీ కూడా నిర్మాత గుణ్ణం గంగరాజుకు అది కాసులు కురిపిస్తూనే ఉంది. ఒకానొక సమయంలో చందమామలో అమృతం పేరుతో సినిమాగా తీశారు, అయితే అది పెద్దగా ఆడలేదు. ఇక మళ్ళి ఎన్నో ఏళ్ల తరువాత అమృతం సీరియల్ పార్ట్ 2 అతి త్వరలో రాబోతోంది. 

 

అమృతం 2.0 గా దీనికి నామకరణం చేసి, మూర్ఖత్వానికి మరణం రాదు అనే శీర్షికని యాడ్ చేసారు. అమృతరావు, అప్పాజీ, సర్వం పాత్రల్లో పార్ట్ 1 లో పాత్రధారులే నటిస్తుండగా, అంజి పాత్ర పోషించిన గుండు మరణించడంతో ఆయన స్థానంలో ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు. ఇక నేడు రిలీజ్ అయిన ఈ సీరియల్ ఫస్ట్ లుక్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్, క్రేజ్ దక్కించుకుంటోంది. జీ 5 యాప్ లో ఉగాది కానుకగా మార్చి 25 నుండి ప్రసారం కానున్న ఈ సీరియల్ ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో ఎంతవరకు కామెడీ ప్రియులకు పండగ చేస్తుందో చూడాలి మరి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: