బుల్లితెర మీద యాంకర్ ప్రదీప్ హంగామా అందరికి తెలిసిందే. తను చేసే షో ఏదైనా సరే సూపర్ హిట్ అవుతుంది. తన కామెడీ టైమింగ్, పంచులు షోకి చాలా ప్లస్ అవుతాయి. టివి ఏదైనా ప్రదీప్ యాంకర్ అంటే షో సక్సెస్ అన్నట్టే. ఇక ఇప్పుడు ప్రదీప్ స్మాల్ స్క్రీన్ నుండి సిల్వర్ స్క్రీన్ కు వెళ్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? అంటూ తన మొదటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు ప్రదీప్. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎస్వి బాబు నిర్మించారు. 

 

ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ ను ఓ క్రేజీ క్వశ్చన్ అడిగింది మరో యాంకర్. సడెన్ గా కాజల్ అగర్వాల్ ఫోన్ చేసి నాతో డేట్ కు వస్తావా అని చెబితే ఏం చేస్తావ్ అని అడిగింది. అయితే వెంటనే దానికి సమాధానంగా ప్రదీప్ తనని తాను ఒక్కసారి గిల్లుకుని నిజమే అయితే మేడం మీరు నాతో జోక్ చేస్తున్నారని అంటానన్నాడు.

 

అయితే ప్రదీప్ చెప్పిన ఈ ఆన్సర్ కాజల్ దాకా వెళ్లడంతో కాజల్ కూడా రెస్పాండ్ అయ్యింది. అలాంటి టిపికల్ క్వశ్చన్ కు క్రియేటివ్ ఆన్సర్ ఇవ్వని అన్నారు కాజల్. అంతేకాదు నీ సినిమాకు ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు. కొంచం టచ్ లో ఉంటే చెప్తా షోతో ప్రదీప్ అందరి స్టార్స్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే తన సినిమాకు స్టార్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: