మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. తనకంటూ ప్రత్యేక  ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకున్నాడు ఈ మెగా వారసుడు. కథల ఎంపికతో పాటుగా ప్రతీ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో... తండ్రి ఇమేజ్ ని పక్కన పెట్టి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

 

ఇక సానియా మీర్జా విషయానికి వస్తే, అతి తక్కువ కాలంలోనే టెన్నీస్ స్టార్ గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికీ భారత్ లో టెన్నీస్ గురించి మాట్లాడితే ఆమె గురించే ప్రస్తావిస్తారు చాలా మంది. సింగిల్స్ లో ప్రభావం చూపించకపోయినా డబుల్స్ లో మాత్రం ఆమె ఆట తీరుకి ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రపంచ స్థాయి ఆట తీరుతో సత్తా చాటింది. ఇది పక్కన పెడితే రామ్ చరణ్, సానియా మీర్జా ఒకప్పుడు ప్రేమలో ఉన్నారట. వీరిద్దరూ ఎక్కువగా హైదరాబాద్ లో కలిసే వారని మీడియాలో వార్తలు వచ్చాయి. 

 

సానియా మీర్జా మ్యాచ్ లు చూడటానికి రామ్ చరణ్ ఇంట్లో తెలియకుండా దుబాయ్ కూడా వెళ్ళే వాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకోవాలని కూడా చూడగా చిరంజీవి కి తెలిసి కట్ చేసాడని అంటారు. ఇది నిజమో కాదో తెలియదు గాని మీడియా మాత్రం ఎన్నో వార్తలు రాసి పండగ చేసుకుంది అప్పట్లో. ఇక ఇప్పుడు ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకుంది. రామ్ చరణ్ ఉపాసనా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: