బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్‌ వీపు మీద అంగులాల మేర ఓ పెద్ద గాయం. పూర్తిగా చర్మం ఓ పోర లేచిపోయి లోపలి కండ కనిపిస్తూ ఎంతో భయానకంగా ఉంది. అసలే జరిగింది. సన్నిలాంటి సుకుమారి ఒంటి మీద ఇంత తీవ్రం గాయం ఏంటి అనుకుంటున్నా. అలా ఏం లేదండి. అది నిజం గాయం కాదు. కేవలం ఒక సినిమా షూటింగ్ కోసం సన్నికి వీపు మీద తీవ్రగాయం అయినట్టుగా మేకప్‌ వేశారు. అయితే ఆ మేకప్‌ వేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది సన్ని. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది.

 

ప్రస్తుతం సన్ని లియోన్.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీరమాదేవి అనే చారిత్రక నేపథ్యమున్న సినిమా చేసింది. ఈ సినిమాను తెలుగు,తమిళం,హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమను వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సన్ని లియోన్.. బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. 

 

బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతూనే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు నిర్మాత బాధ్యతలు కొత్త అయినప్పటికీ ఈ రంగంలో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. తన సొంత బ్యానర్ లో తెరకెక్కించబోతున్న చిత్రం  సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉంటుందని వెల్లడించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

" With so many wonderful vegan shoes, bags and jackets to choose from, there is NO reason to choose to hurt the Environment and take a life by wearing/carrying an animal's Life " Prosthetics makeup by @cloverwootton Shot for @petaindia Shot by @avigowariker Outfit by @hitendrakapopara HMU by @devinanarangbeauty @jeetihairtstylist #SunnyLeone @lakmefashionwk #WearVegan #WearYournOwnSkin #GoVegan #GoVeg #PetaIndia @sachinsbangera @peta

A post shared by sunny Leone (@sunnyleone) on

మరింత సమాచారం తెలుసుకోండి: