తెలుగు, తమిళ భాషల్లో మంచి డిమాండ్ ఉన్న హీరోల్లో విజయదళపతి విజయ్ ఒకరు.  ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ రిలీజ్ అవుతుంది. తమిళ్ లోనే కాదు తెలుగు లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.  అదిరింది, సర్కార్, విజిల్ ఇలా వరుసగా విజయ్ నటించిన చిత్రాలకు మంచి డిమాండ్ మాత్రమే కాదు.. మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి అప్పుడే డిమాండ్ కొనసాగుతుంది. గత కొంత కాలంగా తమిళ స్టార్ విజయ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తన మార్కెట్‌ను పెంచుకోవటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

‘మాస్టర్’ చిత్రం భారీ  బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం ముహూర్తం మొదలైనప్పటి నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మద్య హీరో స్వయంగా ఈ పాటను ఆలపించడంతో బాగా పాపులారిటీ  అవుతన్నాయి విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అయితే, ఈ పాట తెలుగు వర్షన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలపించనున్నట్టు సమాచారం. గతంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ‘ఐ వాన ఫాలో యు’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఇక  విజయ్ కొత్త చిత్రాలకు ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది.

 

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మాస్టర్ తెలుగు వెర్షన్ యొక్క థియేట్రికల్ రైట్స్ రూ .1.35 కోట్లకు,  నెల్లూరులో మరో రూ .48 లక్షలకు అమ్ముడయ్యాయి. కాగా ట్రేడ్ సర్కిల్స్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం సీడెడ్ లో కూడా ఈ సినిమాకి మంచి డిమాండ్ ఏర్పడిందట. అంతే కాదు ఈ చిత్రం భారీ మొత్తం ఇవ్వడానికి బయ్యర్లు రెడీగా ఉన్నారని సమాచారం. జయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: