ప్రస్తుతం తమిళం కి మాత్రమే పరమితం అయి వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్ నయనతార. వరుసగా సినిమా లు చేస్తూ యువ హీరోయిన్లకు వయసు మీద పడుతున్నా సరే పోటీ ఇస్తుంది ఈ భామ. ప్రస్తుత౦ ఖరీదైన హీరోయిన్ గా కూడా ఉంది ఈ అమ్మడు. వయసు మీద పడుతున్నా సరే డిమాండ్ ఉండటంతో ఎక్కడా రాజీ పడటం లేదు నయనతార. తనకంటూ ఒక బ్రాండ్ ఉండటం తో ఇప్పటికే భారీగా పారితోషకం వసూలు చేస్తుంది నయనతార. అయితే ఇప్పుడు కాస్త రేటు తగ్గించింది అంటున్నారు కోలీవుడ్ జనం. 

 

ఈ మధ్య నయన్ పారితోషకం విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనితో నయన పారితోషకం తగ్గించాలని నిర్ణయ౦ తీసుకుంది. సాధారణంగా రూ.4కోట్లు పారితోషికంగా తీసుకునే నయన్‌ ఇటీవల వచ్చిన ‘దర్బార్‌’లో ఏకంగా 37.5శాతం పెంచి రూ.5.5కోట్లు తీసుకుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాను నిర్మించింది లైకా ప్రొడక్షన్స్‌ కాబట్టి... అది ఒక కార్పొరేట్‌ సంస్థ కాబట్టి పెద్దమొత్తంలో ఇచ్చేందుకు ఒప్పుకొ౦దని ఒక నిర్మాణ సంస్థ ప్రతినిధి చెప్పారు. నయనతార ఆ సినిమాకు రూ.10.5కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. 

 

అన్నాత్తే సినిమాను నిర్మిస్తున్న సన్‌ పిక్చర్స్‌ తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ కాబట్టి అంత ఎక్కువ మొత్తం ఇవ్వలేమని స్పష్టం చేసిందని... దీంతో సినిమాను వదులుకోవడం ఇష్టం లేని నయన్‌ గత సినిమాకంటే తక్కువకే చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలిసిందన్నారు. అయితే, ఎంత మొత్తమనేది మాత్రం ఇంకా చెప్పలేదని ఆయన అన్నారు. ఇటీవల ఆమె పారితోషకం విషయంలో నిర్మాతలు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి. మరీ భారీగా ఆమె డిమాండ్ చేయడంతో నిర్మాతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అంటున్నారు. దీనితో ఆమెకు డబ్బులు ఇచ్చే విషయంలో నిర్మాతలు కొన్ని షరతులు కూడా పెట్టారని అంటున్నారు. ఆమెకు రోజు వారీ ఖర్చులు కూడా పారితోషకం నుంచే ఇవ్వాలని భావించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: